రుణమాఫీ ప్రక్రియను ఈ నెల 15వ తేదీలోగా పూర్తిచేయాలని, రైతులందరికీ కొత్త రుణాలు
హైదరాబాద్: రుణమాఫీ ప్రక్రియను ఈ నెల 15వ తేదీలోగా పూర్తిచేయాలని, రైతులందరికీ కొత్త రుణాలు అందేట్లు చూడాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి కలెక్టర్లను కోరారు. బుధవారం సచివాలయం నుంచి వారు జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌లో వూట్లాడారు.
జిల్లాల్లో కలెక్టర్లతోపాటు జిల్లా వ్యవసాయధికారి, లీడ్ బ్యాంకు మేనేజర్లు ఇందులో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 15 వరకు రోజూ కలెక్టర్లతో సమీక్ష చేస్తామని జనార్దన్‌రెడ్డి చెప్పారు. రైతులకు కొత్త రుణాలు తక్షణంగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నందున యుద్ధప్రాతిపదికన రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేయాలని కలెక్టర్లను ఆదేశించారు.