రంగల్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యదేచ్ఛగా కొనసాగుతోంది.
వరంగల్ : వరంగల్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యదేచ్ఛగా కొనసాగుతోంది. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా రవాణా ఆగడంలేదు. తాజాగా మంగళవారం అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. వర్దన్నపేట మండలం ఆకేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా అవుతుందన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ దాడిలో 16 ట్రాక్టర్లను మామునూర్ పోలీసులు మంగళవారం ఉదయం పట్టుకున్నారు. వాటిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
(మామునూర్)