ఓ ఇంట్లో దొంగలు పడి 18 తులాల బంగారు ఆభరణాలు దొంగలించిన సంఘటన రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
యాకుత్‌పురా (హైదరాబాద్) : ఓ ఇంట్లో దొంగలు పడి 18 తులాల బంగారు ఆభరణాలు దొంగలించిన సంఘటన రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం ఎస్‌ఐ గోవింద్ స్వామి తెలిపిన వివరాల ప్రకారం... తలాబ్‌కట్టా ఆమన్‌నగర్-ఎ ప్రాంతానికి చెందిన ఎం.ఎ. వహీద్, డాక్టర్ సమీనాలు దంపతులు. వీరు తలాబ్‌కట్టాలో గత కొన్నేళ్లుగా సమీనా ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు.
కాగా గత నెల 17వ తేదీన కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి శుభకార్యానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడి బీరువాలో ఉన్న 18 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. దీంతో జరిగిన దొంగతనంపై బాధితులు శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.