20 తరువాతా దరఖాస్తుల స్వీకరణ
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్
డబ్బు వసూలుచేసే ఆధార్ కేంద్రాల రద్దు
హైదరాబాద్: అర్హులైనవారందరికీ ఆహారభద్రత కార్డులు, పెన్షన్లు అందిస్తామని పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి కె.తారక రామారావు స్పష్టం చేశారు. గురువారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మా ట్లాడుతూ సంక్షేమ పథకాలను నిర్వహించడం నిరంతర ప్రక్రియ అన్నారు. పెన్షన్లు, ఆహారభద్రతకోసం దరఖాస్తులను ఈ నెల 20 తరువాత కూడా స్వీకరిస్తామన్నారు. సంక్షేమ పథకాలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆహారభద్రత, పెన్షన్ల జారీలో ఎలాంటి రాజకీయాలకు తావుండకూడదని మంత్రి కలెక్టర్లకు సూచించారు. చాలాకాలం క్రితం భర్తలను కోల్పోయిన వితంతులకు ధ్రువీకరణ పత్రాలు తేవడం కష్టమన్నారు.
వితంతువులతోపాటు నిరాశ్రయ మహిళలకు కూడా పెన్షన్లు అందేలా చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. గడువు గురించి ఆందోళన చెందవద్దని, దీనిపై కిందిస్థాయిదాకా ఆదేశాలు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ఆదేశించారు. పత్రికలు, టీవీల ద్వారా ప్రభుత్వ విధివిధానాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దరఖాస్తుల పరిశీల న, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియు పూర్తిగా రెవె న్యూ యుంత్రాంగానికే చెందిందని ఇతర శాఖ ల ఉద్యోగుల ప్రమేయుం అవసరం లేదని సీఎం చెప్పినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ రేవుండ్ పీటర్ కలెక్టర్లకు సూచించారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 8 లక్షల దరఖాస్తులు రావచ్చని కలెక్టర్ వుుఖేశ్ కువూర్ మీనా వుంత్రికి వివరించారు.
పల్లెపల్లెకూ సోలార్ వెలుగులు..
ప్రతి గ్రామంలో సౌర విద్యుత్ వెలుగులు ప్రసరించాలని ఆలోచన తమకు ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కె.తారక రామారావు స్పష్టం చేశారు. దీనిపై త్వరలో సీఎం కేసీఆర్‌తో చర్చించి తుది నిర్ణయాన్ని తీసుకుంటామన్నారు. సోలార్ విద్యుత్‌పై ఆధారపడి గ్రామీణ ప్రాంతాల్లో వీధి దీపాల ఏర్పాటుతో పాటు ఇతర విద్యుత్ అవసరాలను తీర్చుకొనే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు గురువారం ఆయన జాతీయ గ్రామీణాభివద్ధి, పంచాయ తీరాజ్ సంస్థ (నెర్డ్, పీఆర్)ను సందర్శించారు. రాష్ట్రంలోని 8800 గ్రామాల్లో సోలార్ వీధి దీపా ల ఏర్పాటును ఎలా చేపట్టవచ్చో తెలిపే కాన్సెప్ట్ నోట్‌ని తయారు చేసి ఇవ్వాలని అక్కడి అధికారులను కోరారు. నెర్డ్ పీఆర్‌లోని రూరల్ టెక్నాలజీ పార్కుతో పాటు వివిధ విభాగాలను, సంస్థ చేపట్టిన పలు గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తూ మూడు గంటలు గడిపారు.