ఏడాదిలో 2,043 కార్నియా మార్పిడులు | 2043 Cornea changes in LV prasad hospital | Sakshi
Sakshi News home page

ఏడాదిలో 2,043 కార్నియా మార్పిడులు

Published Wed, Apr 12 2017 3:31 AM | Last Updated on Tue, Sep 5 2017 8:32 AM

2043 Cornea changes in LV prasad hospital

ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రి అరుదైన ఘనత: చైర్మన్‌ గుళ్లపల్లి
హైదరాబాద్‌: ఏడాది వ్యవధిలో 2,043 కార్నియా మార్పిడులు చేసి హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి సరికొత్త రికార్డు సృష్టించిందని సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ గుళ్లపల్లి ఎన్‌ రావు తెలిపారు. మంగళవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 24 వేల కార్నియా మార్పిడులు చేసినట్లు వెల్లడించారు.

గత 27 ఏళ్లుగా కార్నియాల సేకరణ, మార్పిడి, కార్నియా వ్యాధులకు స్టెమ్‌సెల్‌ ఆధారిత చికిత్స తదితర విధానాల్లో తమ సంస్థ అహర్నిశలు శ్రమిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైద్య బృందాన్ని ఆయన అభినందించారు. అలాగే సంస్థకు భారీ విరాళాలు అందజేసిన దాత తేజ్‌ కోహ్లీని ఆయన ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement