సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. శనివారం భారీగా 206 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే ఇంత భారీగా కేసులు నమోదు కావడంతో భయాందోళన వ్యక్తమవుతోంది. కరోనా కారణంగా శనివారం ఒక్కరోజే 10 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన పాజటివ్ కేసుల్లో అత్యధికంగా 152 మంది జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రంగారెడ్డి జిల్లా లో 10, మేడ్చల్ జిల్లాలో 18, నిర్మల్, యాదాద్రి జిల్లాల్లో ఐదు చొప్పున నమోదయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 4, జగిత్యాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో 2 చొప్పున, వికారాబాద్, జనగామ, గద్వా ల, నల్లగొండ, భద్రాద్రి, కరీంనగర్, మంచిర్యాల జిల్లా ల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. శనివారం నాటితో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,496 కు పెరిగింది. ఇప్పటివరకు 1,710 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 1,663 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 123కు చేరింది. కరోనా తీవ్రత పెరుగుతుండటంతో అవసరమైతే తప్ప బయటకు రావొద్దని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. స్వీయ వైద్యానికి పాల్పడొద్దని, కరోనా లక్షణాలున్నట్లు అనిపిస్తే వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగాన్ని సంప్రదిస్తే తక్షణ సేవలు అందిస్తామని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment