హైదరాబాద్: తెలంగాణాలో మరో 22 స్వైన్‌ప్లూ కేసులు నమోదయ్యాయి. గతేడాది ఆగస్టు 1 నుంచి ఇప్పటివరకూ 648 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలిపింది. మొత్తం 125 నమూనాల్లో 22 కేసుల్లో ఎచ్1ఎన్1 వైరస్ ఉన్నట్లు గుర్తించారు. గతేడాది ఆగస్టు 1 నుంచి నేటివరకూ 5,229 నమూనాల్లో 621 కేసులు పాజిటివ్‌గా నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఒక్క మరణం కూడా నమోదవ్వలేదని బులిటెన్ విడుదల చేసింది. తగిన స్థాయిలో మందులు, సామాగ్రి అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.