జిల్లాలో ఓటరు దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యింది. ఈ ఏడాది జనవరి 1వతేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన
నల్లగొండ : జిల్లాలో ఓటరు దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యింది. ఈ ఏడాది జనవరి 1వతేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతను ఓటర్లుగా నమోదు చేయాలన్నది ఎన్నికల సంఘం ప్రధానఉద్దేశం. దీనిలో భాగంగా నవంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 16వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా కొత్తవారు ఓటరుగా నమోదయ్యేందుకు దరఖాస్తులు స్వీకరించారు. ఎన్నికల సిబ్బంది వద్దకు, ఆన్‌లైన్ ద్వారా 15,684 దరఖాస్తులొచ్చాయి. వీటి ఆధారంగా ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేశారు. ఈ కార్యక్రమం సోమవారంతో ముగిసింది. దీంట్లో కొత్తగా ఓటరు నమోదు పొందేందుకు 9,390 దరఖాస్తులు అర్హత సాధించాయి. వివిధ కారణాల దృష్ట్యా 6,294 దరఖాస్తులు తిరస్కరించారు. దీంతో జిల్లాలో గతేడాది అసెంబ్లీ ఎన్నికల నాటికి 25,38,250 మంది ఓటర్లు ఉండగా, కొత్తగా ఓటర్లు 25,41,346 మంది పెరిగారు. కాగా కొత్త ఓటర్ల జాబితాను అధికారికంగా ఈ నెల 16వ తేదీన ప్రకటిస్తారు.
ఆధార్ కార్డుకు అనుసంధానం
ఓటరు జాబితాలో బోగస్ ఓటర్లను తొలగించాలన్న ఉద్దేశంతో కొత్త ఓటర్ల జాబితాను ఆధార్ కార్డులకు అనుసంధానం చేయాలని ఈసీ నిర్ణయించింది. ఒక ప్రాం తంలో నివసిస్తూ, మరొక ప్రాంతంలో ఓటు కలిగి ఉండడం, మరణించిన వారి ఓట్లు, వల స వెళ్లిన వారి ఓట్లు కూడా తొలగించడం సుల భ మవుతుంది. ఆధార్‌కార్డుకు అనుసంధానించే క్రమంలో ఆ వివరాలను ఓటర్ల నుంచి సేకరించాలా..? ఆధార్ కార్డు డేటా బ్యాంకు నుంచి సేకరించాలా..? అనే అంశాలపై ఎన్నికల సంఘం ఆలోచిస్తోంది. ఇప్పటి కే మన రాష్ర్టంలో పలు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని పెలైట్ ప్రాజెక్టుగా చేపట్టారు. ఇది వి జయవంతమైన పక్షంలో ఫిబ్రవరిలో మన జిల్లాలో ఓటరుకార్డును ఆధార్ కార్డుకు అనుసంధానం చే సే అవకాశముందని అధికారులు తెలిపారు.