సాక్షి, హైదరాబాద్ : దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్)లో 269 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ అయింది. 155 అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ), 114 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. పూర్తి వివరాలను ఈ నెల 20న లేదా ఆ తర్వాత www.tssouthernpower.com వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నామని తెలిపింది.
155 ఏఈ పోస్టుల్లో 133 ఏఈ (ఎలక్ట్రికల్), 20 ఏఈ (సివిల్) పోస్టులున్నాయి. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్)లో సైతం 1,843 జూనియర్ లైన్‌మెన్ (జేఎల్‌ఎం) పోస్టుల భర్తీకి మరో వారంలో ప్రకటన జారీ కానుంది. తెలంగాణ ట్రాన్స్‌కోలో 330 ఏఈ, 174 సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), 1,100 జేఎల్‌ఎం పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రకటనలు జారీ చేయగా, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment