
హైదరాబాద్ అభివృద్ధికి 3 కమిటీల ఏర్పాటు
హైదరాబాద్ : నగర అభివృద్ధిపై తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు దృష్టిసారించారు. హైదరాబాద్ అభివృద్ధి నిమిత్తం మూడు కమిటీలను సీఎం కేసీఆర్ మంగళవారం ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలసౌద వంటి ఒక్కో అంశంపై ఒక్కో కమిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో కేసీఆర్ నిర్ణయించారు. ఈ కమిటీలలో ప్రతి పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, కొంత మంది అధికారులకు స్థానం కల్పించడం విశేషం. ఈ కమిటీల తీరు, నిర్వహణ అంశంపై జూన్ నెల 8వ తేదీన రాష్ట్ర కేబినెట్ మరోసారి భేటీ అవనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.