
అసలే నిధుల మంట.. ఆపై కేసుల తంటా!
కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు బాలారిష్టాలు
రెండు ప్రాజెక్టులపై కోర్టుల్లో ఏకంగా 30 పిటిషన్‌లు
గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో ఆగిన పాలమూరు పనులు
సాక్షి, హైదరాబాద్: మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా ఉంది ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు ఎత్తి పోతల పథకాల పరిస్థితి! ఈ 2 ప్రాజెక్టులకు బాలారిష్టాలు ఇప్పట్లో వీడేలా లేవు. ఈ ప్రాజెక్టుల పరిధిలో ముప్పుతిప్పలు పెట్టిన భూసేకరణ సమస్య కొలిక్కి వచ్చి, పనులు ఆరంభమైన కొద్దిరోజులకే పెద్ద నోట్ల రద్దు పిడుగు పడింది. ఈ సమస్యతో ఇప్పటికే పనులు నెమ్మదించగా.. ఇప్పుడు కోర్టులు, ట్రిబ్యునల్ కేసులతో మొత్తంగా పనులన్నీ ఆగిపోయే పరి స్థితి ఏర్పడింది. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదే శాలతో ఇప్పటికే పాలమూరు పనులను పూర్తిగా నిలిపేశారు. కాళేశ్వరం పనులు నిలిపివేయాలని, సామాజిక ప్రభావ మదింపు జరగకుండానే ప్రాజెక్టు చేపడుతున్నారంటూ కొందరు గ్రీన్ ట్రిబ్యునల్ గడప తొక్కేందుకు సిద్ధమయ్యారు.
పనులు ఎంత వరకు?
పాలమూరు, కాళే«శ్వరం ప్రాజెక్టులకు ఈ బడ్జెట్ లో ఒక్కో దానికి రూ.6,500 కోట్ల మేర నిధులు కేటాయించారు. పాలమూరు పరిధిలో 21,780 ఎకరాల మేర భూసేకరణ అవసరం ఉండగా.. కేవలం 13 వేల ఎకరాలే పూర్తవడంతో బడ్జెట్‌ను రూ.1,650 కోట్లకు కుదించారు. ఇందులోనూ ఈ ఏడాది ఇప్పటివరకు రూ.700 కోట్లే ఖర్చు చేశా రు. అందులో దాదాపు రూ.600 కోట్లు భూసేకర ణకే చెల్లించారు. మరో రూ.100 కోట్ల పనులు మాత్రమే జరిగాయి. ఇక కాళేశ్వరం పరిధిలో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నా మూడు నెలల నుంచి నిధులు విడుదల కాక రూ.800 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
పనులకు ‘పిటిషన్ల’ బ్రేకులు
రెండు ప్రాజెక్టుల పరిధిలో చేపడుతున్న భూసేక రణ తీరును సవాల్ చేస్తూ హైకోర్టులో ఏకంగా 30 పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఇందులో పాలమూరుపై 5 పిల్‌లు, 9 రిట్ పిటిషన్‌లు కాగా.. కాళేశ్వరంపై 16 రిట్ పిటిషన్‌లు దాఖలయ్యాయి. దీనికి తోడు ఇటీవల అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖల అనుమతు ల్లేకుండా పాలమూరు పనులు చేపట్టడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేశారు. దీంతో ట్రిబ్యు నల్ ప్రాజెక్టు పనుల నిలిపివేతకు ఆదేశాలి వ్వడంతో ఆదివారం నుంచి దాదాపు రూ.30 వేల కోట్ల పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక కాళేశ్వరం పరిధిలోని మల్లన్నసాగర్‌కు సంబం ధించి హైకోర్టుకు 10 కేసుల వరకు వచ్చాయి. ఎప్పుడో పూర్తి కావాల్సిన భూసేకరణ ఏడాదిగా కొనసాగుతూనే ఉంది. ఇక్కడ 13 వేల ఎకరాలకు గానూ 10 వేల ఎకరాల భూసేకరణ పూర్తయిం ది. భూసేకరణ పూర్తయిన రిజర్వాయర్‌లకు అనుమతులు ఇచ్చి టెండర్ల ప్రక్రియ మొదలవు తున్న సమయంలో కొందరు దీనిపైనా గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిణామాలను ప్రాజెక్టులను అడ్డుకునేందుకు జరుగుతున్న రాజకీయ కుట్రగానే ప్రభుత్వం చూస్తోంది.