ఆటో బోల్తాపడి ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
కాగజ్నగర్: ఆటో బోల్తాపడి ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం బోడేపల్లిలో చోటుచేసుకుంది. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.