
బాలుడి ఆత్మహత్యాయత్నం
ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దుర్గం జగదీశ్(14) ఆత్మహత్యాయత్నం చేశాడు.
జైపూర్: ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దుర్గం జగదీశ్(14) ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసుల వరుస విచారణలు, వేధింపులు తాళలేకే ఆత్మహత్యాయత్నం చేశాడని తల్లిదండ్రులు దుర్గం లచ్చయ్య, రాజమ్మ దంపతులు ఆరోపించారు. లచ్చయ్య, రాజమ్మ దంపతుల చిన్నకుమారుడు జగదీశ్(14) అదే గ్రామానికి చెందిన సెగ్గం రాజం ఇంట్లో గత ఏడాది జరిగిన చోరీ కేసులో నిదింతుడిగా ఉన్నాడు. చోరీ కేసు నమోదు కావడం, ఇతర కేసుల్లోనూ పోలీసులు వరుసగా విచారణ చేపడుతున్నారు.
కరీంగనర్ జిల్లా గోదావరిఖని1-టౌన్, బెల్లంపల్లి 1-టౌన్, కాసిపేట, మందమర్రి, మంచిర్యాల, సీసీఎస్, జైపూర్ పోలీసులు పలు కేసుల్లో విచారణ పేరిట నిత్యం ఇంటికి వచ్చి జగదీశ్‌ను స్టేషన్‌కు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 6గంటల ప్రాంతంలో సీసీఎస్ పోలీసులు ఇంటికి వచ్చి వెళ్లారు. ఆ తర్వాత రెండున్నర గంటల్లోనే భయూందోళనకు గురై జగదీశ్ పురుగుల మందు తాగాడని, మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తల్లిదండ్రులు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. స్థానిక ఎస్సై సురేందర్, సీఐ వేణుచందర్‌లను సంప్రదించగా.. తమ సిబ్బంది ఎవరూ వెళ్లలేదని తెలిపారు.