చేయని నేరానికి తమను జైలుకు పంపారని అవమానం భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మహబూబ్‌నగర్: చేయని నేరానికి తమను జైలుకు పంపారని అవమానం భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం నేరళ్లపల్లి పంచాయతీ గుడిబండ తండాలో చోటు చేసుకుంది. వివరాలివీ..తండాకు చెందిన భానోవత్ శకుంతల గత జనవరి నెలలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అయితే తమ కూతురు అత్తింటి వేధింపులతోనే చనిపోయిందని ఆమె తల్లిదండ్రులు...అల్లుడు కృష్ణ, మామ ధావుర్యా(60), అత్త భామినీలపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో వీరిని అరెస్టు చేశారు. ఈ నెల 6న థావుర్యా, భామినీ బెయిల్‌పై విడుదలై గ్రామానికి వచ్చారు. అయితే చేయని నేరానికి జైలుకు పంపారని మనస్తాపం చెందిన థావుర్యా ఆదివారం ఉదయం పశువుల కొట్టంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
(బాలానగర్)