'షాదీ ముబారక్'లో అక్రమాలపై ఏసీబీ విచారణ | ACB raids in shaadi mubarak scheme issues | Sakshi
Sakshi News home page

'షాదీ ముబారక్'లో అక్రమాలపై ఏసీబీ విచారణ

Published Sun, Mar 27 2016 6:15 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ACB raids in shaadi mubarak scheme issues

నార్నూరు: ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలంలో షాదీ ముబారక్ పథకంలో జరిగిన అక్రమాలపై ఏసీబీ అధికారులు ఆదివారం విచారణ నిర్వహించారు. 2003 నుంచి 2008 మధ్య వివాహం చేసుకున్న వారు కూడా ఇటీవల షాదీ ముబారక్ పథకం కింద లబ్ది పొందిన విషయాన్ని సాక్షి పత్రిక కథనాలను ప్రచురించింది. దీంతో ముగ్గురు ఏసీబీ అధికారులు నార్నూరు ఎమ్మార్వో కార్యాలయంలో డిప్యూటీ ఎమ్మార్వో సోము సమక్షంలో రికార్డులను తనిఖీ చేపట్టారు. 11 మందికిగాను ఇద్దరు లబ్దిదారులను గుర్తించారు. అనంతరం రెండు రోజుల తర్వాత మరోసారి తనిఖీలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement