
కల్తీ కిక్
బిరడా విప్పు.. స్పిరిట్ పోయూ..
{పాణాలు కోల్పోతున్న పేదలు
జోరుగా నకిలీ ‘మందు’ దందా
లక్షలు గడిస్తున్న అక్రమార్కులు
స్పందించని ఆబ్కారీ శాఖ
ఫిర్యాదు చేస్తేనే దాడులు
పచ్చని కాపురంలో చిచ్చు
రోడ్డున పడుతున్న కుటుంబాలు
ములుగు : జిల్లాలో కల్తీ మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. కాసులకు కక్కుర్తి పడి మద్యం దందా నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మద్యంలో ప్రాణాంతక స్పిరిట్, నీళ్లు కలిపి రూ.లక్షలు గడిస్తున్నారు. హైదరాబాద్ నుంచి శిక్షణ పొందిన కొంత మందిని వైన్‌షాప్‌ల నిర్వాహకులు రోజువారి కూలీ కింద రూ.300 నుంచి రూ.500 ఇచ్చి రప్పిస్తున్నారు. వీరితో మద్యం బిరడ, లేబుల్ ఏర్పడకుండా తీరుుంచి స్పిరిట్, నీళ్లతో కల్తీ చేస్తున్నారు. ప్రముఖ బ్రాండ్‌లలో ఏర్పడకుండా కలిపి ఎప్పటిలాగే బిరడా, లేబుల్ వేస్తున్నారు. మ ద్యం ప్రియులకు కూడా ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఈ మద్యం సేవించిన మద్యం ప్రియులు, నిరుపేదలు తల నొప్పి, వాంతులు, శరీరం వేడెక్కడం, కాళ్లు లా గడం, కళ్లు తిరగడం వంటి వాటితో అచేతన స్థితిలోకి చేరుకుంటున్నారు. మరికొందరు ప్రాణా లు వదులుతున్నారు. ఈ దందా అమ్మకాలు ఆబ్కా రీ అధికారులకు తెలిసిన మామూలుగా తీసుకుం టున్నారు. అమ్మకాలు భూపాలపల్లి, వర్ధన్నపేట, ములుగు, కొత్తగూడ, గణపురం, వరంగల్ పట్టణా ల్లో అధికంగాృజరుగుతున్నట్లు ఆబ్కారీ దాడుల్లో నిర్ధారణ అరుుంది.
కల్తీ ఇలా..
కల్తీ రెండు పద్ధతుల ద్వారా జరుగుతుంది. ఒకటి మ ద్యం బాటిల్ బిరడను తీసి కల్తీ చేయడం, రెండోది బా టిల్ లేబుల్ కింద ఉన్న తొలగించి తిరిగి యథాస్థానానికి అమర్చడం. మద్యం బాటిళ్ల బిరడ(మూత)ను పీ కేసి బాటిల్ నుంచి 25 శాతం ఒరిజినల్ మద్యాన్ని బ యటకు తీస్తారు. తీసిన మద్యం స్థానంలో అతి ప్ర మాదకర స్పిరిట్ లేదా నీళ్లతో నింపుతారు. మద్యం ప్రియులకు అనుమానం రాకుండా బాటిల్‌లేబుల్, బె రడును డబ్లుకం సహాయంతో అమరుస్తారు. మద్యం కల్తీకి మహారాష్ట్ర, పూణే, బీహార్‌లలో దొరికే స్పిరిట్‌ను వాడుతున్నట్లు సమాచారం. ఈ స్పిరిట్ మద్యంలో కలిసినా అనుమానం రాకుండా ఉంటుంది.
గ్రామాలకు తరలింపు
ఇలా తయూరైన మద్యంను వ్యాపారులు ద్విచక్రవాహనాలు, ఆటోలలో మూరుమూల ప్రాంతాల్లోని బెల్ట్‌దుకాణాలు తరలిస్తున్నారు. ఊళ్లలో ఎవరు అడితే వారు ఉండదని వారి ధీమా. ఇక పల్లెలకు, తండాలకు, గూ డెలకు తరలిస్తే అధికారుల దాడి జరిగిన సమయంలో తమకు ఇబ్బందులు కలుగవని వ్యాపారులు భావిస్తున్నారు. అయితే చేస్తున్న కల్తీ మద్యం సుమారు పది రోజులు నిల్వగా ఉంటే అసలు స్వరూపాన్ని బయటపెడుతుందని అధికారులు తెలిపారు. కల్తీ అనుమానం రాకుండా ఉండేందుకు వ్యాపారులు రాత్రి సమయాల్లో మద్యాన్ని కల్తీచేసి రెండు రోజుల గడువులో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ కల్తీ అయిన మద్యం గడువులోగా పూర్తికాని పక్షంలో వ్యాపారులే నేరుగా మద్యాన్ని పారబోస్తున్నారు.
ఫిర్యాదులు వస్తేనే దాడులు
గ్రామీణ ప్రాంతాల్లో విచ్చల విడిగా కల్తీ మద్యం అమ్మకాలు సాగుతున్నా ఆబ్కారీ అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆయా ప్రాంతాల నుం చి కల్తీ మద్యంపై ఫిర్యాదు అందితే తప్పా దాడులు నిర్వహించడం లేదు. గత జూన్ నుంచి ఇప్పటివరకు జిల్లాలో కేవలం 22 వైన్‌షాపులపై మాత్రమే దాడులు చేశారు. జిల్లాకేంద్రంలో కల్తీ వ్యాపారం జోరందుకు న్నా అధికారులుచూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కల్తీ వ్యాపారం చేసే వైన్‌షాపుల యజమానుల నుంచి ఎక్సైజ్ అధికారులకు, సంబంధిత అధికారులకు నెలవారీగా ముడుపులు అందుతున్న కారణంగా దాడులపై వెనుకడుగు వేస్తున్నట్లు మద్యం ప్రియుల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. జీవితాలను బుగ్గిపాలు చేసే మద్యం కల్తీ వ్యాపారాన్ని అరికట్టాలని మద్యం ప్రియులు కోరుతున్నారు.