ఏజీ రామకృష్ణారెడ్డి రాజీనామా | AG Ramakrishna Reddy resigned | Sakshi
Sakshi News home page

ఏజీ రామకృష్ణారెడ్డి రాజీనామా

Published Thu, Jul 13 2017 12:31 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

ఏజీ రామకృష్ణారెడ్డి రాజీనామా - Sakshi

ఏజీ రామకృష్ణారెడ్డి రాజీనామా

సీఎస్‌ ద్వారా గవర్నర్‌కు రాజీనామా లేఖ
కొత్త ఏజీగా దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి?
ప్రాథమికంగా నిర్ణయించిన సీఎం కేసీఆర్‌
ఒకటి, రెండు రోజుల్లో వెలువడనున్న ఉత్తర్వులు
ఏఏజీ విషయంలోనూ రానున్న స్పష్టత


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) పదవికి కొండం రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్‌ ద్వారా ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు. రామకృష్ణారెడ్డి రాజీనామాకు గవర్నర్‌ ఆమోదం తెలపాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర మొదటి ఏజీగా రామకృష్ణారెడ్డి 2014 జూన్‌ 21న నియమితులయ్యారు. ఏజీ పోస్టుకు పలువురు సీనియర్‌ న్యాయవాదులు పోటీ పడినా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మాత్రం రామకృష్ణారెడ్డి వైపే మొగ్గు చూపి ఆయననే ఏజీగా నియమించారు. పలు కీలక కేసుల్లో ప్రభుత్వం తరఫున ఆయన ఉమ్మడి హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో వాదనలు వినిపించారు. కొత్త అడ్వకేట్‌ జనరల్‌గా దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి నియమితులయ్యే అవకా శాలున్నాయి.

 ప్రకాశ్‌రెడ్డిని ఏజీగా నియమించాలని కేసీఆర్‌ ఇప్పటికే ప్రాథమిక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఏజీ నియామకంపై ప్రకాశ్‌రెడ్డితో సీఎం ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. కొత్త ఏజీ నియామకానికి సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి. కాగా, హైకోర్టులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన పలు కేసుల్లో ప్రకాశ్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేక వాదనలు విని పించడం విశేషం. మంగళవారం కూడా ఆయన ఆన్‌లైన్‌ రమ్మీ కేసులో రమ్మీ కంపెనీల తరఫున హాజరయ్యారు. ప్రస్తుత అదనపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ) జె. రామచంద్రరావు పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో, ఆయనను మరోసారి కొనసాగిస్తారా? లేక కొత్త వారిని నియమిస్తారా? అన్న చర్చ సాగుతోంది.

ఏఏజీ విషయంలోనూ ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది. కొత్త ఏజీ నియమితు లయ్యాక ప్రభుత్వ న్యాయవాదులు, సహాయ ప్రభు త్వ న్యాయవాదులు, స్టాండింగ్‌ కౌన్సిళ్ల ప్రక్షాళన జరి గే అవకాశముంది. ప్రస్తుతమున్న వారిలో పలువురికి ఉద్వాసన తప్పేలా లేదు. ఇప్పటికే సీఎం ప్రభుత్వ న్యాయవాదుల పనితీరుపై నిఘావర్గాల నుంచి నివేదికలు తెప్పించుకున్నారని తెలుస్తోంది.

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు...
తెలంగాణ రాష్ట్రానికి తొలి అడ్వకేట్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం తనకు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఏజీ పదవికి రాజీనామా చేసిన తరువాత ఆయన మాట్లాడుతూ, రాజీనామా విషయంలో తనకు ఎవరిపై ఎటువంటి అసంతృప్తి లేదన్నారు. ప్రభుత్వం తరఫున కీలక కేసుల్లో వాదనలు వినిపించి వేల కోట్ల రూపాయల విలువైన భూములను కాపాడినందుకు గర్వంగా ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement