AG Ramakrishna Reddy
-
ఏజీ రామకృష్ణారెడ్డి రాజీనామా
♦ సీఎస్ ద్వారా గవర్నర్‌కు రాజీనామా లేఖ ♦ కొత్త ఏజీగా దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి? ♦ ప్రాథమికంగా నిర్ణయించిన సీఎం కేసీఆర్ ♦ ఒకటి, రెండు రోజుల్లో వెలువడనున్న ఉత్తర్వులు ♦ ఏఏజీ విషయంలోనూ రానున్న స్పష్టత సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అడ్వకేట్ జనరల్ (ఏజీ) పదవికి కొండం రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ద్వారా ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు. రామకృష్ణారెడ్డి రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర మొదటి ఏజీగా రామకృష్ణారెడ్డి 2014 జూన్ 21న నియమితులయ్యారు. ఏజీ పోస్టుకు పలువురు సీనియర్ న్యాయవాదులు పోటీ పడినా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మాత్రం రామకృష్ణారెడ్డి వైపే మొగ్గు చూపి ఆయననే ఏజీగా నియమించారు. పలు కీలక కేసుల్లో ప్రభుత్వం తరఫున ఆయన ఉమ్మడి హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో వాదనలు వినిపించారు. కొత్త అడ్వకేట్ జనరల్‌గా దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి నియమితులయ్యే అవకా శాలున్నాయి. ప్రకాశ్‌రెడ్డిని ఏజీగా నియమించాలని కేసీఆర్ ఇప్పటికే ప్రాథమిక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఏజీ నియామకంపై ప్రకాశ్‌రెడ్డితో సీఎం ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. కొత్త ఏజీ నియామకానికి సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి. కాగా, హైకోర్టులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన పలు కేసుల్లో ప్రకాశ్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేక వాదనలు విని పించడం విశేషం. మంగళవారం కూడా ఆయన ఆన్లైన్ రమ్మీ కేసులో రమ్మీ కంపెనీల తరఫున హాజరయ్యారు. ప్రస్తుత అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) జె. రామచంద్రరావు పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో, ఆయనను మరోసారి కొనసాగిస్తారా? లేక కొత్త వారిని నియమిస్తారా? అన్న చర్చ సాగుతోంది. ఏఏజీ విషయంలోనూ ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది. కొత్త ఏజీ నియమితు లయ్యాక ప్రభుత్వ న్యాయవాదులు, సహాయ ప్రభు త్వ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిళ్ల ప్రక్షాళన జరి గే అవకాశముంది. ప్రస్తుతమున్న వారిలో పలువురికి ఉద్వాసన తప్పేలా లేదు. ఇప్పటికే సీఎం ప్రభుత్వ న్యాయవాదుల పనితీరుపై నిఘావర్గాల నుంచి నివేదికలు తెప్పించుకున్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు... తెలంగాణ రాష్ట్రానికి తొలి అడ్వకేట్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం తనకు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఏజీ పదవికి రాజీనామా చేసిన తరువాత ఆయన మాట్లాడుతూ, రాజీనామా విషయంలో తనకు ఎవరిపై ఎటువంటి అసంతృప్తి లేదన్నారు. ప్రభుత్వం తరఫున కీలక కేసుల్లో వాదనలు వినిపించి వేల కోట్ల రూపాయల విలువైన భూములను కాపాడినందుకు గర్వంగా ఉందన్నారు. -
మీడియాపై హైకోర్టుకు ఏజీ ఫిర్యాదు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకష్ణారెడ్డి బుధవారం మీడియాపై హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. సచివాలయ కూల్చివేత కేసులో హైకోర్టు స్టే ఇచ్చినట్లు కొన్ని పత్రికలు (సాక్షి కాదు) ప్రచురించాయని ఆయన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం దష్టికి తీసుకొచ్చారు. స్టే ఇచ్చినట్లు పతాక శీర్షికల్లో ప్రచురించాయంటూ కొన్ని పత్రికల పేర్లను ప్రస్తావించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, తాము ఎటువంటి స్టే ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. తదుపరి విచారణ వరకు కూల్చబోమని మీరు (అడ్వొకేట్ జనరల్) ఇచ్చిన హామీనే రికార్డ్ చేసి, కౌంటర్ దాఖలు చేయాలని మాత్రమే ఆదేశించామని తెలిపింది. ఇందులో తాము ఇచ్చిన ఉత్తర్వులేమీ ఇవ్వలేదని తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలను యథాతథంగా ప్రచురిస్తుండటంపై కూడా ధర్మాసనం ఒకింత అసంతప్తిని వ్యక్తం చేసింది. స్టే ఇచ్చినట్లు వచ్చిన కథనాలకు సంబంధించి రాతపూర్వకంగా పిటిషన్ దాఖలు చేసుకుంటే పరిశీలిస్తామని అడ్వొకేట్ జనరల్‌కు ధర్మాసనం తెలిపింది. -
30న అసెంబ్లీ!
* అదే రోజున శాసన మండలి భేటీ కూడా.. * ఒకే రోజు సమావేశం.. జీఎస్టీ ఆమోదమే ఎజెండా * సభలను సమావేశపర్చాలని మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్‌ను కోరిన సీఎం సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ బిల్లును ఆమోదించేందుకు ఈనెల 30న శాసనసభ, శాసనమండలిని సమావేశపరచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ మేరకు సమావేశాలు నిర్వహించాలని శుక్రవారం మండలి చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనాచారిలను కోరారు. పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరిస్తూ ఇటీవల జీఎస్టీ చట్టం తెచ్చిన విషయం తెలిసిందే. ఆ చట్టం అమల్లోకి రావాలంటే దేశంలో సగానికిపైగా రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ బిల్లును ఆమోదించేందుకు ప్రత్యేకంగా ఒక్కరోజే సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై శుక్రవారం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు, అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారం, అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి తదితరులతో సీఎం సమావేశమయ్యారు. అనంతరం జీఎస్టీ బిల్లుపై చర్చించడానికి ఈనెల 30న ఉదయం 11 గంటలకు సభలను సమావేశపరచాలని మండలి చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనాచారిలకు సీఎం విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశం కావడంతో సభ్యులకు పూర్తి వివరణ ఇవ్వడానికి ఏజీ రామకృష్ణారెడ్డిని సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలవాలని కోరారు. ఇక ప్రతిపక్షాలు కోరితే వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్ మూడో వారంలో నిర్వహించే అవకాశముంది. బీఏసీ సమావేశంలో తీసుకునే నిర్ణయం మేరకు సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనేది ఖరారవుతుందని అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి.