అగ్రి పాలిటెక్నిక్‌తో ఉపాధి
జగిత్యాల జోన్, న్యూస్‌లైన్ : పదో తరగతి పూర్తైన గ్రామీణ ప్రాంత విద్యార్థుల కు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సులు వర ంగా మారాయి. రెండేళ్ల కోర్సు చేసిన విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉండడంతో ఈ కోర్సులకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా వ్యవసాయంపై మక్కువ ఉన్నవారు, రైతుబిడ్డలు మరిం తగా వ్యవసాయ విజ్ఞానాన్ని పొంది, సాగుచేసే పంటల్లో అధిక దిగుబడులు సాధించేందుకు ఈ కోర్సు చాలా ఉపయోగపడుతోంది.
ఈ కోర్సు చేసిన తర్వాత, ఉన్నత విద్యాభ్యాసం చేయాలంటే ఎంసెట్‌తో సంబంధం లేకుండా బీఎస్సీ(అగ్రికల్చర్)లో చేరవచ్చు. బీఎస్సీ అగ్రి కల్చర్‌లో డిప్లొమా చేసిన వారికి 10 శాతం సీట్లు రిజర్వ్ చేస్తారు. ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు వివిధ రకాల పంటలు పండించే విధానం, పంటలకు ఆశించే తెగుళ్లు, క్రిమికీటకాలపై శాస్త్రవేత్తలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు శిక్షణ ఇస్తారు. వ్యవసాయ అనుబంధరంగాల్లో శిక్షణతోపాటు, గ్రామాలు సందర్శించి, అక్కడి రైతులతో చర్చాగోష్టులు నిర్వహించాల్సి ఉంటుంది.
రెండో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ‘పొలాస’
రాష్ట్రంలో మొదటి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల మహబూబ్‌నగర్ జిల్లా పాలెంలో ఉండగా, రెండో కళాశాల జిల్లాలోని పొలాసలో 1996లో ఏర్పాటుచేశారు. ఈ కళాశాలలో ఇప్పటివరకు సుమారు వెయ్యి మంది విద్యార్థులు అభ్యసించగా, దాదాపు 70 శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడగా, మిగతా 30 శాతం మంది ప్రైవేట్ రంగాల్లో టెక్నికల్ అసిస్టెంట్లుగా, ఫీల్డ్ సూపర్‌వైజర్లుగా, డాటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు.
సీట్ల వివరాలు
దరఖాస్తులను బట్టి సీట్లను కౌన్సిలింగ్ పద్ధతి ద్వారా భర్తీ చేస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న వ్యవసాయ పాలిటెక్నిక్‌లో 21 ప్రభుత్వ కాలేజీల్లో 700 సీట్లు, 17 ప్రైవేట్ కాలేజీల్లో 1,020 సీట్లు ఉన్నాయి. విత్తన సాంకేతిక పరిజ్ఞానంలో రెండు ప్రభుత్వ కాలేజీల్లో 85 సీట్లు, మూడు ప్రైవేట్ కాలేజీల్లో 150 సీట్లు ఉన్నాయి. అలాగే మూడేళ్ల అగ్రికల్చర్ ఇంజినీరింగ్ డిప్లొమాలో మూడు ప్రభుత్వ కళాశాలల్లో 90 సీట్లు, 8 ప్రైవేట్ కాలేజీల్లో 240 సీట్లు ఉన్నాయి.
నోటిఫికేషన్ జారీ
2014 విద్యా సంవత్సరానికిగాను ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ వి.ప్రవీణ్‌కుమార్ గురువారం నోటిఫికేషన్ జారీచేశారు. వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానంలో రెండేళ్ల పాలిటెక్నిక్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్ పాలిటెక్నిక్‌లో మూడేళ్ల డిప్లొమా కోర్సులకు సంబంధించి పదో తరగతి చదివిన విద్యార్థులు అర్హులు. ఇంటర్, ఆపైన చదువులు చదివిన వారు అనర్హులు.
ఆగస్టు 31, 2014 నాటికి 15 నుంచి 22 ఏళ్ల మధ్య వయస్సు వారై ఉండాలి. పదో తరగతిలో జనరల్ విద్యార్థులు 5.0 గ్రేడ్, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ విద్యార్థులు 4.0 గ్రేడ్ పాయింట్ ఆవరేజ్ వచ్చినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుతో పాటు జనరల్ విద్యార్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ విద్యార్థులు రూ.200 ఫీజును డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులు హైదరాబాద్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పంపేందుకు జూలై 2, 2014 ఆఖరు తేదీగా ఉంది. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ గిగిగి.ఊఎఖఅ్ఖ.అఇ.ఐూ, పొలాస వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో సంప్రదించవచ్చు.