సాక్షి, యాదాద్రి : శాసనమండలి సభ్యుడిగా టీఆర్‌ఎస్ తరఫున భువనగిరికి చెందిన సీనియర్ నేత ఎలిమినేటి కృష్ణారెడ్డి పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల 7వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుంది. ఈనేప థ్యంలో సీఎం తమ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఇం దులో భాగంగా భువనగిరికి చెందిన కృష్ణారెడ్డి పేరును వెల్లడించారు.
నామినేషన్ వేయనున్న ఆయనకు ఎమ్మెల్యేల సంపూర్ణ మెజార్టీ ఉన్నందున ఆయన ఏకగ్రీ వంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. నేడు హైదరాబాద్‌లో ఆయన నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కృష్ణారెడ్డి పేరును పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారని తెలియడంతో ఆయన కుటుంబంతోపాటు అభిమానులు, పార్టీ కార్యకర్తల్లో హర్షం వ్యక్తం చేశారు. బాణాసంచాకాల్చి మిఠాయిలు పంచారు.
‘ఎలిమినేటి’కి ఎమ్మెల్సీ
Published Mon, Mar 6 2017 3:57 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM
Advertisement
Advertisement