తెలంగాణలో నకిలీ, దొంగ సర్టిఫికెట్లను అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. ఈ విషయమై తాము విద్యాశాఖ, పోలీసుశాఖలతో పాటు వివిధ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్లర్లతో కూడా చర్చించామన్నారు. నకిలీలను అరికట్టేందుకు అన్ని సర్టిఫికెట్లను ఆన్లైన్ చేయాలన్న ఆలోచన ఉందని, గత 30 ఏళ్లకు సంబంధించిన సర్టిఫికెట్లు అన్నింటినీ ఆన్లైన్ చేస్తామని ఆయన అన్నారు.
స్కూళ్ల రేషనలైజేషన్ జీవో అమలవుతుందని, అవసరమైతే ఈ జీవోకు మార్పు చేర్పులు చేస్తామని జగదీశ్ రెడ్డి తెలిపారు. ఈ విషయమై ఉపాధ్యాయ సంఘాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలతో తమకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఆన్లైన్లోకి 30 ఏళ్ల సర్టిఫికెట్లు
Published Tue, Sep 30 2014 4:09 PM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM
Advertisement