అభ్యర్థుల గెలుపును కోరుతూ ప్రచారం | All Party Activists Campaign In Khammam | Sakshi
Sakshi News home page

అభ్యర్థుల గెలుపును కోరుతూ ప్రచారం

Published Thu, Nov 8 2018 1:52 PM | Last Updated on Thu, Nov 8 2018 1:54 PM

All Party Activists Campaign In  Khammam - Sakshi

సాక్షి, ఇల్లెందు(ఖమ్మం):ఇల్లెందు పట్టణం, మండలంలో టీఆర్‌ఎస్‌తో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తమ తమ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ మంగళవారం వేర్వేరుగా ప్రచారాలు నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పూబెల్లి, కొల్లాపురం గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటు అభ్యర్థించారు. 

టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు మడత వెంకట్‌గౌడ్‌ సారధ్యం చేపట్టిన ప్రచారంలో మండల కో ఆఫ్సన్‌ సభ్యులు జానీబాబా, మాజీ సర్పంచ్‌ చీమల నాగరత్నం, రావుల ఐలయ్య, కల్తీ పద్మ, ధనుంజయ, సుకనకయ్య, ఆత్మకమిటీ చైర్మన్‌ ముక్తి కృష్ణ, ఎంపీటీసీలు మండల రాము, గోపాల్, నేతలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలో ఆర్‌అండ్‌ఆర్‌ 16వ వార్డులో టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు సిలివేరు సత్యనారాయణ, కోటిరెడ్డి, జేకే శ్రీను, మేకల శ్యాం, అక్కిరాజు గణేష్, మడుగు సాంబమూర్తి, తిరుపతిరావు తదితరలు పాల్గొని అభ్యర్థి కోరం కనకయ్యను గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు.  
 
బస్టాండ్‌ సెంటర్‌లో బీజేపీ ప్రచారం.. 
పట్టణంలోని బస్టాండ్‌ సెంటర్, వివిధ వార్డులో బీజేపీ అభ్యర్ధి మోకాళ్ల నాగ స్రవంతి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను ఓటు అభ్యర్థించారు. ఇప్పటి వరకు ఎన్డీ, సీపీఐ, టీడీపీ, కాంగ్రెస్‌లకు అవకాశం ఇచ్చారని, ఈ దఫా తనకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. నాయకులు బిందె కుటుంబరావు,బలగాని గోపీకృష్ణ,  తెప్పల శ్రీనివాస్, విజయారాణి, పట్నం మహిపాల్, అజయ్, సంకెళ్ల శారద తదితరులు ఆమె వెంట ఉన్నారు. 

మంగ్యతండాలో .. 
టేకులపల్లి: మండలంలో టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగానే మండలంలోని మంగ్యతండాలో జెడ్పీటీసీ సభ్యుడు లక్కినేని సురేందర్‌రావు ఆధ్వర్యంలో మంగళవారం ముమ్మరంగా ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి టీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలను వివరించారు. కోరం కనకయ్యను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ పూనెం సురేందర్, బుర్ర ధర్మయ్య, దేవ్‌సింగ్, మంగ్య, కోటి, రామకృష్ణ, మురళి, డాలయ్య తదితరులు పాల్గొన్నారు. 
 
టీఆర్‌ఎస్‌లో చేరికలు ..
ఇల్లెందు: తాజా, మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్‌ కో ఆఫ్సన్‌ సభ్యులు మడత వెంకట్‌గౌడ్‌ సమక్షంలో వార్డు కౌన్సిలర్‌ పి. స్వర్ణలత, పర్రె శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో వార్డుకు చెందిన 60 కుటుంబాలు వారు టీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్, టీడీపీ, ఎన్డీల నుంచి పి.నరేందర్, తరాల రమేష్, రాజేష్, లక్ష్మణ్, శ్రీనివాస్, బోగ రవి, ఉపేంద్ర, లక్ష్మి, యశోద, విజయ, దన్నా, వాహేద, దుర్గయ్యలతో పాటు 60 కుటుంబాలు చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా కనకయ్య, వెంకట్‌గౌడ్‌లు మాట్లాడుతూ వార్డుల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ పర్రె స్వర్ణలత, పర్రె శ్రీనివాస్, నాయకులు అక్కిరాజు గణేష్, సిలివేరు సత్యనారాయణ, గందె సదానందం, ఎంపీటీసీ సురేందర్, రాము, జేకే శ్రీను, మన్నాన్, బస్తీ ప్రజలు పాల్గొన్నారు.  


 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement