అమిత్‌షా రెండో రోజు పర్యటన షెడ్యూల్
అమిత్‌షా రెండో రోజు పర్యటన షెడ్యూల్
Published Tue, May 23 2017 8:20 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
నల్గొండ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నల్గొండ జిల్లాలో రెండో రోజు మంగళవారం కూడా పర్యటించనున్నారు. ఉదయం వెలుగుపల్లి గ్రామంలో పండిట్ దీన్ దయాళ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. అక్కడినుంచి బీజేపీ సర్పంచ్ ఉన్న చిన్న మాదారం గ్రామానికి వెళతారు. అక్కడ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలిస్తారు.
అక్కడినుంచి నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న పెద్దదేవులపల్లికి వెళ్లి పోలింగ్ బూత్ పార్టీ నాయకులతో సమావేశమవుతారు. సాయంత్రానికి నల్లగొండ వెళ్లి లక్ష్మీగార్డెన్స్‌లో జరిగే ఓబీసీల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడతారు.
Advertisement
Advertisement