హన్మకొండ చౌరస్తా : హైదరాబాద్‌లోని సుమారు రూ.1200 కోట్ల తెలంగాణ ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ యాజమాన్యం చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టిన ఘనత తెలంగాణ మజ్దూర్ యూనియన్‌దే నని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి అన్నారు. హన్మకొండ కాపువాడలోని మాతా గార్డెన్‌లో బుధవారం ఆర్టీసీ టీఎంయూ ద్వితీయ మహా సభ జరిగింది. టీఎంయూ జిల్లా అధ్యక్షుడు ఈఎస్.బాబు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా అశ్వత్థామరెడ్డి మాట్లాడారు.
మరో రూ.500 కోట్ల భారాన్ని మోపి టీఎస్‌ఆర్టీసీని అప్పుల పాలు చేసేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ కుట్ర చేసిందని ధ్వజమెత్తారు. ఆంధ్ర యాజమాన్య కుట్రలను తిప్పి కొట్టి, తెలంగా ణ ఆర్టీసీ ఆస్తులను పరిరక్షించే క్రమంలో సమావేశం జరగకుండా నిలువరించగలిగామన్నా రు. మూడేళ్లలోనే టీఎంయూ 12 రీజియన్లలో బలోపేతమైదని తెలిపారు.
రానున్న ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో టీఎంయూ విజయఢంకా మోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని, సిబ్బంది ప్రజలతో మమేకమై వారి మన్ననలను పొందాలని సూచించారు. ప్రజలకు సేవలందిస్తూనే హక్కుల పరిరక్షణలో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ఆర్టీసీని లాభాల బాట పట్టించాలి
ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, ఆరూరి రమేష్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరిచిపోలేనిదని అన్నారు. ఆర్టీసీలో మన వాటా, మన నిధులను దక్కించుకుని లాభాల బాటలో తీసుకువెళ్లేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. టీఎంయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు టీఎంయూ కృషి చేస్తోందని పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం ఆవిర్భవించిన టీఎంయూ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి, యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతయ్య, ఆర్‌ఎం యాదగిరి, డిప్యూటీ సీఎంఈ శ్రీధర్, బీవీ.రెడ్డి, అశోక్, పీఆర్.రెడ్డి, దామోదర్‌రెడ్డి, సోమయ్య, లక్ష్మయ్య పాల్గొన్నారు.
ఆంధ్ర కుట్రలను తిప్పికొట్టాం
Published Thu, Oct 16 2014 3:11 AM | Last Updated on Tue, Sep 4 2018 5:15 PM
Advertisement