సాక్షి,హైదరాబాద్ : రాష్ట్రంలోని ఆవులకు సోకుతున్న పాక్స్ వైరస్ నివారణకు ఇప్పటికే అన్ని జిల్లాల్లోని ఆవులకు గోట్ పాక్స్ టీకాలు వేయించామని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ వి.లక్ష్మారెడ్డి తెలిపారు. ఇంకా ఎక్కడైనా గోవులు మిగిలి ఉం టే వెంటనే టీకాలు వేయించుకోవాలని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. ’పశువులపైనా వైరస్ పడగ’ శీర్షికన ఆదివారం సాక్షి మెయిన్ ఎడిషన్‌లో ప్రచురితమైన కథనంపై లక్ష్మారెడ్డి స్పందించారు. రాష్ట్రంలోని ఆవులకు తామిచ్చిన గోట్ పాక్స్ టీకా వల్ల లుంఫీస్కిన్ వ్యాధి రాబోదని తెలిపారు. వ్యాధి సోకినట్టు దృష్టికి రాగానే అప్రమత్తమయ్యామన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నేతృత్వంలో మందుల కొనుగోలుకు అన్ని జిల్లాలకు నిధులు మంజూరు చేశామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment