
అర్బయిన్ ర్యాలీలో పాల్గొన్న షియా ముస్లింలు
చార్మినార్: హజ్రత్ ఇమాం హుస్సేన్ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఆయన మరణించిన 40వ రోజును పురస్కరించుకొని మంగళవారం షియా ముస్లిం ప్రజలు పాతబస్తీ వీధుల్లో అర్బయిన్ (నిరసన) ర్యాలీని నిర్వహించారు. కోట్ల ఆలిజాలోని జాఫ్రీ మసీదు నుంచి ప్రారంభమైన ర్యాలీ కోట్లా ఆలిజా, ఎతేబార్‌చౌక్, మీరాలంమండి, పురానీహవేలి ద్వారా దారుషిఫా గ్రౌండ్ వరకు కొనసాగింది. షియా ముస్లింలు దారి పొడవున రక్తం చిందిస్తూ మాతం నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా మీర్‌చౌక్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. దక్షిణ మండలం డీసీపీ అంబర్ కిశోర్ ఝా, మీర్‌చౌక్ ఏసీపీ ఆనంద్ తదితరులతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా బందోబస్తును పర్యవేక్షించారు. ర్యాలీలో నగరానికి చెందిన ప్రతినిధులతో పాటు కర్ణాటక, ముంబయి, చెన్నై తదితర ప్రాంతాలకు చెందిన అంజుమన్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment