హన్మకొండ అర్బన్ : వివిధ రకాల పింఛన్ల కోసం ఇటీవల దరఖాస్తులను ఆహ్వానించగా జిల్లాలో లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నా యి. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు ఐదు లక్షల దరఖాస్తులు అందినట్లు అధికారిక వర్గాల సమాచారం. అయితే, దరఖాస్తుదారుల్లో ఎవ రు అర్హులో, ఎవరు అనర్హులో అనే విషయమై ప్రభుత్వం విధివిధానాలను రూపొందించింది. ఆ వివరాలు విభాగాల వారీగా ఇలా ఉన్నాయి.
దరఖాస్తు విధానం
ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, వికలాం గులు, గీత కార్మికులు, చేనేత కార్మికులతో పాటు సంచార గిరిజన జాతుల వారికి వేర్వేరు గా పింఛన్లు మంజూరు చేయనుంది. ఈ మేర కు అర్హతలు కలిగిన వారు తెల్ల కాగితంపై వ్యక్తిగత వివరాలు, ఆధార్ నంబర్‌తో సంబందిత గ్రామపంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం సమగ్ర కుటుంబ సర్వేలో వెల్లడించిన విషయాల ఆధారంగా దరఖాస్తుదారుల కుటుంబ వివరాలు ఉద్యోగులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అర్హుల దరఖాస్తులను పింఛన్ కోసం ప్రతిపాదిస్తారు.
వృద్ధాప్య పింఛన్
ఈ పింఛన్ కోసం 65 ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకోవాలి. జనన ధ్రువీకరణ పత్రం, ఓటరు జాబితా, ఆధార్ కార్డు ఆధారంగా వ యస్సు నిర్ధారిస్తారు. వాటిలో వివరాలు వాస్తవదూరంగా ఉన్నప్పుడు కుటుంబ పరిస్థితి, వివాహ సమయం, పిల్లల వయస్సును పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, కుటుంబంలో ఒకరికి మాత్రమే వృద్ధాప్య పింఛన్ మంజూరు చేస్తారు. ఇంట్లో భార్యాభర్తలు పింఛన్‌కు అర్హులని తేలితే భార్యకు మాత్రమే మంజూరవుతుం ది. ఇక ఐకేపీ ఉన్నతి సర్వేలో పేదలుగా గుర్తిం చిన వారిని తప్పనిసరిగా పింఛన్ కోసం అధికారులు ప్రతిపాదిస్తారు.
వితంతు పింఛన్
18ఏళ్లు వయస్సు నుంచి వివాహమై భర్త మరణించిన మహిళలు వితంతు పింఛన్‌కు అర్హులవుతారు. దరఖాస్తుతోపాటు భర్త మరణ ధ్రు వీకరణ పత్రం జత చేయాల్సి ఉంటుంది. ఒకవేళ భర్త మరణించి పదేళ్లు దాటి రికార్డులు లభించని వారి నుంచి దరఖాస్తు స్వీకరించి ఆ తర్వాత ఆర్డీఓ ధ్రువీకరణ పత్రం ఇస్తే పింఛన్ కోసం ప్రతిపాదిస్తారు. ఇక్కడ కూడా ఉన్నతి సర్వేలో నిర్ధారణ అయిన వారికి ప్రాధాన్యముంటుంది.
వికలాంగుల పింఛన్
కుటుంబంలో వైకల్యం ఉన్న వారు 40 శాతానికి పైగా వైకల్యం ఉన్నట్లు సదరం సర్టిఫికెట్ పొంది ఉండాలి. వినికిడి లోపం ఉన్న వారైతే 51శాతం వైకల్యంతో సర్టిఫికెట్ కలిగి ఉండాలి. సదరం సర్టిఫికెట్ లేని వారు కూడా దరఖాస్తు చేసుకుంటే అధికారులే సదరం క్యాంపునకు పంపిస్తారు. ఉన్నతి సర్వేలో ప్రతిపాదించిన వికలాంగులను అధికారులు విధిగా పింఛన్ కోసం ప్రతిపాదిస్తారు.
చేనేత, గీత కార్మికులు
50ఏళ్ల వయస్సు నిండి చేనేత సహకార సం ఘంలో సభ్యుడైన వ్యక్తి చేనేత పింఛన్ కోసం అర్హులవుతారు. కుటుంబంలో చేనేత పింఛన్‌తో పాటు వితంతువులు, వికలాంగులు ఉన్నట్లయితే వారు కూడా పింఛన్‌కు అర్హులుగా అధికారులు గుర్తిస్తారు. గీత కార్మికుల విషయంలో కూడా 50ఏళ్లు నిండి గీత పారిశ్రామిక సహకార సంఘంలో సభ్యుడై ఉండాలి. ఈ పింఛన్‌తో పాటు కుటుంబంలో అర్హులు ఉంటే ఇతర పిం ఛన్లు పొందవచ్చు. అలాగే, 50ఏళ్ల వయస్సు నిండిన వారు సంచార గిరిజన జాతుల పింఛన్ కు అర్హులవుతారు.
పింఛన్ల మంజూరుకు అర్హతలివే..
Published Mon, Oct 20 2014 3:42 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 PM
Advertisement
Advertisement