
గోదావరిలో బాహు‘బాలుడు’
రామగుండం(కరీంనగర్): గోదావరి పుష్కరాలలో భాగంగా ఓ అరుదైన సంఘటన కనిపించింది. బాహుబలి సినిమాలో ప్రముఖ నటి రమ్యకృష్ణ నదిలో మునిగి ఓ చేయి పైకెత్తి ఓ బాబుని పట్టుకుని నిలబడుతోంది. అచ్చంగా అదే సీన్ కరీంనగర్ జిల్లా రామగుండం మండలంలోని ముర్మూర్ పుష్కరఘాట్ వద్ద దర్శనమిచ్చింది. ఈ ఫొటో చూస్తే బాహుబలి చిత్ర సన్నివేశాన్ని తలపిస్తోంది కదూ!