కరీంనగర్‌టౌన్: ఎంపీని అని కూడా చూడకుండా తనపై పోలీసులు దాడి చేస్తే రాష్ట్ర హోంమంత్రి, డీజీపీ ఏం చేస్తున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని, మఫ్టీ పోలీసులే శవాన్ని ఎత్తుకెళ్లారని, ఇది సిగ్గుచేటన్నారు. శనివారం కరీంనగర్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసులు ముఖ్యమంత్రికి గులాంగిరీ చేస్తున్నారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులు మఫ్టీలో ఉండి కార్యకర్తలపై పిడిగుద్దులు గుద్దారని, ఏబీవీపీ కార్యకర్త కిరణ్‌ను బూటు కాళ్లతో తొక్కారని, ఆ దెబ్బలకు విలవిల కొట్టుకుంటున్నా పోలీసులు కనికరం లేకుండా వ్యవహరించారని ఆరోపించారు. ఆసుపత్రి నుంచి వచి్చన అంబులెన్స్ డ్రైవర్‌ను కొట్టి పోలీసులే మృతదేహాన్ని ఇంటి వద్ద పడేసి వెళ్లారని ఆరోపించారు. ఆ కుటుంబానికి, కారి్మకులకు న్యాయం జరగాలన్న ఆర్టీసీ జేఏసీ నిర్ణయం మేరకు అంత్యక్రియలు ఆపడం జరిగిందన్నారు. సీఎం చర్చలు జరిపేంత వరకు అంతిమయాత్ర చేయకూడదని జేఏసీ నిర్ణయించిందని చెప్పారు.
అయితే చివరి చూపుగా డిపోకు తమ నాన్న మృతదేహాన్ని తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు కోరడంతో యాత్ర శాంతియుతంగా చేయాలని నిర్ణయించి, ప్రారంభిస్తే పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరమని అన్నారు. ఆ ఇద్దరు పోలీసులపై పార్లమెంట్‌లో ప్రివిలేజ్ మోషన్ పెడుతానంటూ ఆయన హెచ్చ రించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని, గవర్నర్ నివేదిక కూడా కేంద్రానికి వెళ్లిందని, సరైన సమయంలో తప్పక స్పందిస్తుందని ఎంపీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment