
బంగారు కోడిపెట్ట !
మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం మన్సుర్‌పూర్‌కి చెందిన అంతారం రాజు ఏడు నెలల క్రితం హన్మంత్‌రావుపేటకి చెందిన ఓ వృద్ధురాలి వద్ద నుంచి రూ.610కి రెండు కోడిపెట్టలను కొన్నాడు. వీటిలో ఒక పెట్ట 211 రోజులుగా క్రమం తప్పకుండా గుడ్లు పెడుతూనే ఉంది. కోళ్లు సహజంగా నెల పాటు వరుసగా గుడ్లు పెడతాయి. కానీ ఈ పెట్ట మాత్రం 211 రోజులుగా రోజుకో గుడ్డు పెడుతూనే ఉంది.
- నారాయణఖేడ్