కొట్టి చంపి తగలబెట్టారు | Beaten,killed and burned | Sakshi
Sakshi News home page

కొట్టి చంపి తగలబెట్టారు

Published Thu, Dec 17 2015 3:32 AM | Last Updated on Sun, Sep 2 2018 3:43 PM

కొట్టి చంపి తగలబెట్టారు - Sakshi

కొట్టి చంపి తగలబెట్టారు

మెదక్ జిల్లాలో రైతు దారుణ హత్య

 టేక్మాల్/పాపన్నపేట: మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బోడగట్టులో బుధవారం పంట చేనుకు కాపలా వెళ్లిన రైతు దారుణ హత్యకు గురయ్యాడు. బోడగట్టుకు చెందిన తోట శంకరయ్య(50) తన పొలంలో మొక్కజొన్న పంట వేశాడు. పందుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు రోజూ రాత్రివేళల్లో చేను వద్ద వెళ్లి నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారంరాత్రి పొలానికి వెళ్లి మంచెపై పడుకున్న శంకరయ్యపై దుండగులు దాడి చేసి కర్రలతో కొట్టి చంపారు.

మృతదేహంపై వరిగడ్డి వేసి తగలబెట్టారు.  అతని కుమారుడు సాయిలు ఉదయం చేనుకు వెళ్లి చూడగా శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న  మెదక్ రూరల్ సీఐ రామకృష్ణ సంఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహం వద్ద నుంచి పోలీసు జాగిలాలు మంచె , గడ్డివాము, గ్రామంలోని మృతుడి ఇంటి వద్ద నిలబడడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement