ఫైల్ ఫోటో
కేసముద్రం: దర్బాంగా నుంచి మైసూరుకు వెళ్తున్న భాగమతి ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయా ణికుడు సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టి స్విచ్ వేయ డంతో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి స్వల్పంగా మెరుపులు, ఆ తర్వాత దట్టమైన పొగలు వచ్చాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నె, కేసముద్రం రైల్వేస్టేషన్ల మధ్య గురువారం చోటు చేసుకుంది. వరంగల్ మీదుగా డౌన్‌లైన్‌లో వెళ్తున్న భాగమతి ఎక్స్‌ప్రెస్ ఇంటికన్నె రైల్వేస్టేషన్ దాటాక ఓ ప్రయాణికుడు చార్జింగ్ కోసం చార్జర్‌ను ప్లగ్‌లో పెట్టి స్విచ్ వేశాడు.
ఒక్కసారిగా బోగీ పైకప్పులో ఉన్న తీగల నుంచి మెరుపులు వచ్చాయి. స్వల్పంగా నిప్పులు వచ్చి పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై కేకలు పెట్టారు. బోగీలో ఉన్న ప్రయాణికుల్లో కొందరు చైన్ లాగారు. దీం తో రైలు నిలిచిపోగా రైల్వేసిబ్బంది వచ్చి ఎలాంటి భయం లేదని ధైర్యం చెప్పి, తిరిగి కేసముద్రం రైల్వేస్టేషన్‌లోని మెయిన్‌లైన్‌లో రైలును నిలిపివేశారు. సిబ్బంది టియర్ గ్యాస్‌తో పొగలను చల్లార్చారు. అరగంటపాటు రైలు నిలిచింది. తిరిగి యథావిధిగా రైలును ముందుకు పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment