
సాక్షి, హైదరాబాద్: రాజకీయకాంక్ష లేకుంటే ఎవరైనా ప్రజల్లో ఎందుకు తిరుగుతారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క ప్రశ్నించారు. అసెంబ్లీ లాబీలో బుధవారం విలేకరులు కోదండరాం పార్టీ గురించి, కాంగ్రెస్‌లోకి కోదండరాంను ఆహ్వానించినట్టుగా జరుగుతున్న ప్రచారం గురించి ప్రశ్నించగా ఆయన పై విధంగా స్పందించారు. కాంగ్రెస్ భావజాలం నచ్చినవారెవరైనా పార్టీలో చేరతారని.. దీనికి ఎవరికీ, ఎలాంటి అడ్డంకులు లేవన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు ఉన్నవారెవరైనా పార్టీ పెట్టుకోవచ్చునన్నారు.
Comments
Please login to add a commentAdd a comment