కేసీఆర్‌ది నియంత ప్రభుత్వం: భట్టి
కొణిజర్ల(వైరా): కేసీఆర్ ప్రభుత్వం నిజాం పాలనను తలపిస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ముదిగొండ స్టేషన్‌లో ఉన్న రైతులను పరామర్శించేందుకు శనివారం వెళ్తున్న మల్లు భట్టి విక్రమార్క, జిల్లా కాంగ్రెస్ నాయకులను ఖమ్మం నగరంలో అరెస్టు చేసి కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అనంతరం భట్టి విలేకరులతో మాట్లాడుతూ.. దోపిడీ దొంగలను, ఆటంకవాదులను అరెస్టు చేసినట్లు రైతులను శనివారం వేకువ జామున పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని అన్నారు. రైతును ఆదుకోవాల్సింది పోయి తిరిగి వారిపైనే కేసులు బనాయించడం బాధాకరమని చెప్పారు.