మధిరలో ప్రచారం నిర్వహిస్తున్న మల్లు భట్టి విక్రమార్క
సాక్షి, మధిర: నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా అహర్నిశలు పనిచేస్తున్న తనను మరోసారి గెలిపించాలని, ప్రజల రుణం తీర్చుకుంటానని తాజా మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మధిరలోని వైరా రోడ్డులో బుధవారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఎమ్మెల్యేగా ఇప్పటికి రెండుసార్లు గెలిపించారని, మధిర ప్రజల గొంతుకను అసెంబ్లీలో వినిపించానని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో సు మారు రూ.1500కోట్ల నిధులతో అభివృద్ధి చేయడంతోపాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి రెండోసారి కూడా ప్రభుత్వంతో పోరాడి నిధులు సాధించడం జరిగిందన్నారు. ప్రజల నమ్మకాన్ని ఏనాడూ వమ్ముచేయలేదని, ప్రజా బలమే తనకు అండ అని తెలిపారు.
మధిర నియోజకవర్గ ప్రజ లు ఎంతో చైతన్యవంతులని, అభివృద్ధికే పట్టం కడతారని, సరైన నాయకుడిని ఎన్నుకునే సంప్ర దాయం ఈ ప్రాంత ప్రజలకు ఉందన్నారు. కాంగ్రె స్ పాలనలోనే ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అం దుతాయని, అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల కమిటీ చైర్మ న్ రంగా అప్పారావు, మండల కాంగ్రె స్ అధ్యక్షు డు సూరంశెట్టి కిషోర్, నాయకులు వే మిరెడ్డి శ్రీని వాసరెడ్డి, తూమాటి నర్సిరెడ్డి, రంగా హన్మంతరావు, భరత్ విద్యాసంస్థల అధినేత వెంకటరెడ్డి, కర్నాటి రామారావు, నవయుగ వెంకటరెడ్డి, తలుపుల వెంకటేశ్వర్లు, జహంగీర్, సముద్రాల పురుషోత్తం, వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, బండారు నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
అధిష్టానం పిలుపుతో హుటాహుటిన..
మధిరలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న మల్లు భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపు రావడంతో ప్రచరాన్ని మధ్యలో నిలిపివేసి భట్టి హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. పార్టీ అభ్యర్థుల తుది జాబితాపై చర్చించేందుకు వెళుతున్నట్లు ఆయన చెప్పారు. ఆలస్యమవుతుందనే ఉద్ధేశ్యంతో ఆయన విజయవాడకు వెళ్లి అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment