భూదాన్ బోర్డు రద్దుపై ప్రభుత్వానికి నోటీసులు | Bhudan board notices to the government 's annulment | Sakshi
Sakshi News home page

భూదాన్ బోర్డు రద్దుపై ప్రభుత్వానికి నోటీసులు

Published Fri, May 22 2015 12:22 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 AM

Bhudan board notices to the government 's annulment

కౌంటర్ల దాఖలుకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: భూదాన్ యజ్ఞ బోర్డును రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 13న జారీ చేసిన 59, 60 జీవోలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ కలెక్టర్‌లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చంద్రభాను గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. భూదాన్ బోర్డు రద్దు జీవోలను కొట్టేసి, కాల పరిమితి ఉన్నంత కాలం తనను బోర్డు చైర్మన్‌గా కొనసాగించేటట్లు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ జి.రాజేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement