భూదాన్ బోర్డు రద్దుపై ప్రభుత్వానికి నోటీసులు
కౌంటర్ల దాఖలుకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: భూదాన్ యజ్ఞ బోర్డును రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 13న జారీ చేసిన 59, 60 జీవోలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చంద్రభాను గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. భూదాన్ బోర్డు రద్దు జీవోలను కొట్టేసి, కాల పరిమితి ఉన్నంత కాలం తనను బోర్డు చైర్మన్గా కొనసాగించేటట్లు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ జి.రాజేందర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.