notices to the government
-
వ్యవసాయ బిల్లులు : కేంద్రానికి సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : గత నెల పార్లమెంట్లో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్ధానం ఆదేశించింది. పార్లమెంట్ ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేయడంతో అవి చట్టరూపం దాల్చాయి. చత్తీస్‌గఢ్‌కు చెందిన కిసాన్ కాంగ్రెస్ నేత రాకేష్ వైష్ణవ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే, ఏఎస్ బొపన్న, వీ రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ దీనిపై బదులివ్వాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను కోరింది. నూతన వ్యవసాయ చట్టాలతో చత్తీస్‌గఢ్‌లోని స్ధానిక చట్టాలకు కాలం చెల్లుతుందని అంటూ నూతన చట్టాలను కొట్టివేయాలని పిటిషనర్ వైష్ణవ్ తరపు న్యాయవాది పీ పరమేశ్వరన్ సర్వోన్నత న్యాయస్ధానాలకు విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ అంశంపై దాఖలైన నాలుగు పిటిషన్లు కోర్టు ముందుకు వచ్చాయి. విపక్షాల వ్యతిరేకత మధ్య గతనెల పార్లమెంట్ ఆమోదించిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో విపక్షాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. చదవండి : ఉపశమనం ఇంతటితో సరి -
కమల్’ ఎఫెక్ట్
♦ ప్రభుత్వానికి నోటీసు తమిళసినిమా: లోకనాయకుడు కమల్ చేసిన అవినీతి ఆరోపణలు ప్రభుత్వానికి నోటీసులు అందేలా చేశాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వ అవినీతి గుట్టు రట్టు చేయాలని అభిమానులకు కమల్ పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. మంత్రుల ఫోన్ నెంబర్లు సైతం వారి బయోడేటాల నుంచి తొలగించబడ్డాయి. దీనిపై డీఎంకే ఎమ్మెల్యే పళనివేల్ త్యాగరాజన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రాగా ప్రభుత్వ వెబ్‌సైట్స్‌లో మార్పులేమిటో, మంత్రుల వివరాలు, ప్రత్యేక ఖాతాలు మొత్తం మూసివేయడానికి గల కారణాలు ఏమిటోనని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై తగిన వివరణ ఇవ్వాలంటూ రెండు వారాల గడువుతో ప్రభుత్వానికి ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, న్యాయమూర్తి సుందర్ నేతృత్వంలోని ప్రధాన బెంచ్ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఆగస్టు 21వ తేదీకి వాయిదా వేశారు. -
భూదాన్ బోర్డు రద్దుపై ప్రభుత్వానికి నోటీసులు
కౌంటర్ల దాఖలుకు హైకోర్టు ఆదేశం హైదరాబాద్: భూదాన్ యజ్ఞ బోర్డును రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 13న జారీ చేసిన 59, 60 జీవోలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చంద్రభాను గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. భూదాన్ బోర్డు రద్దు జీవోలను కొట్టేసి, కాల పరిమితి ఉన్నంత కాలం తనను బోర్డు చైర్మన్‌గా కొనసాగించేటట్లు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ జి.రాజేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.