ఊరట.. ’గురుకుల’ పరీక్షపై స్టే ఎత్తివేత | big relief to telangana government in high court | Sakshi
Sakshi News home page

ఊరట.. ’గురుకుల’ పరీక్షపై స్టే ఎత్తివేత

Published Tue, Aug 1 2017 4:01 PM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM

ఊరట.. ’గురుకుల’  పరీక్షపై స్టే ఎత్తివేత - Sakshi

ఊరట.. ’గురుకుల’ పరీక్షపై స్టే ఎత్తివేత

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట కలిగింది. గురుకులాల పరిధిలోని డిగ్రీ కళాశాలల లెక్చరర్ల రాతపరీక్షపై విధించిన స్టేను మంగళవారం హైకోర్టు ఎత్తివేసింది. దీంతో రాత పరీక్షకు మార్గం సుగమం అయింది. గురుకులాల్లోని మహిళా కళాశాలల్లో ఉద్యోగాలన్నీ కూడా మహిళలకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంపై కొంతమంది పురుష అభ్యర్థులు కోర్టుకు ఎక్కారు. దాంతో గత జులై 30న జరగాల్సిన పరీక్షను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  

దీంతో ప్రభుత్వం తరుపున కోర్టుకు తాజాగా వివరణ ఇవ్వడంతో దానితో ఏకీ భవించిన కోర్టు స్టేను ఎత్తివేసింది. దీంతో డిగ్రీ కళాశాలల లెక్కరర్ల రాత పరీక్ష జరగనుంది. మరోపక్క, గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగ నియామక పరీక్షలకోసం  జారీ చేసిన జీవో 1274ను హైకోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువరించకపోవడంతో దీనిపై టీఎస్‌పీఎస్సీ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. మరోపక్క, కొత్త షెడ్యూల్‌ను కూడా టీఎస్‌పీఎస్సీనే ప్రకటించాల్సి ఉంది. మొత్తం 500 పోస్టుల్లో మహిళకే కేటాయిస్తూ టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపైనే ధుమారం రేగింది.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement