అన్నదానం చేస్తున్న ఖాజా
అనంతగిరి/వికారాబాద్ అర్బన్: వికారాబాద్ పట్టణానికి సమీపంలోని అనంతగిరిగుట్ట టీబీ శానిటోరియంలో చికిత్స పొందుతున్న రోగులు ఆకలి కేకలు పెడుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 40 మందికిపైగా ఇన్‌పేషెంట్లు ఉన్నారు. వారికి నిత్యం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనంతో పాటు మందులను ఉచితంగా అందజేస్తారు. కానీ సదరు కాంట్రాక్టర్‌కు 14 నెలలుగా బిల్లులు చెల్లించలేదు. ఇన్నాళ్ల పాటు అప్పులు చేసి భోజనం వడ్డించిన కాంట్రాక్టర్ జనవరి 31 నుంచి ఆపేశాడు.
ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు మానవతా దృక్పథంతో చందాలు వేసుకుని నాలుగు రోజులుగా రోగులకు భోజనం అందిస్తున్నారు. ఇక్కడి పరిస్థితి తెలుసుకున్న 17వ వార్డు కౌన్సిలర్ ఫైముదాబేగమ్‌ఖాజా కూడా ముందుకు వచ్చి రోగులకు ఆహారం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా 9 మంది వైద్యులు, ఒక సూపరింటెండెంట్, ఆర్‌ఎం ఇక్కడ సేవలు అందించాల్సి ఉండగా కేవలం ఒకే ఒక్క వైద్యురాలు (మృదుల) మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment