కాళోజీసెంటర్: అంగన్‌వాడీ కేంద్రాల్లో అక్రమాలకు ప్రభుత్వం ఇక చెక్ పెట్టనుంది. బయోమెట్రిక్ యాప్ ద్వారా పౌష్టికాహారం అందించేందు కు చర్యలు చేపట్టింది. ఇన్నాళ్లు ప్రభుత్వం ద్వారా సరఫరా అయ్యే పౌష్టికాహారం, ఇతర సరుకులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు మెండుగా ఉండేవి. ఆ ఆక్రమాలను అరికట్టేందు కు రాష్ట్ర ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయబోతోంది.
అంగన్‌వాడీల నుంచి అందే ఆహారం..
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో అంగన్‌వాడీ కేంద్రాల పాత్ర గొప్పది. వీటి ద్వారా పౌష్టికాహారం అందించడమే కాకుండా ఆరోగ్య పరీక్షలు, పూర్వ ప్రాథమిక విద్య, రెఫరల్ విద్యలు, వ్యాధి నిరోధక టీకాలు, పోషణ, ఆరోగ్య విద్యలాంటి సేవలందిస్తున్నారు. ఆరోగ్యలక్ష్మి పథకం అమలులో ఒక పూట సంపూర్ణ భోజనం అందుతోంది. ఈ పథకంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు నెలకు 2.5 కిలోల బాలామృతం, 16 గుడ్లు అందజేస్తారు. అదేవిధంగా మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు ఒక్కపూట భోజనంతో పాటు ఉడికించిన గుడ్లు, స్నాక్స్ ఇస్తారు.
గర్భిణీ, బాలింతలకు పోషక విలువలతో కూడిన ఒక పూట సంపూర్ణ భోజనంతో పాటు 200 మిలీ పాలు, ఉడికించిన గుడ్డు ప్రతిరోజు అందజేయబడుతుంది. అయితే అంగన్‌వాడీ కేం ద్రాల్లో రికార్డుల్లో నమోదైన సంఖ్యకు సెంట ర్‌కు హాజరవుతున్న వారి సంఖ్యలకు పొంతన లేకు ండా ఉంటున్నాయని ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బయోమెట్రిక్ యాప్ ద్వారా పౌష్టికాహారం అందించనుంది. సెంటర్‌కు హాజరైన వారిని బయో మెట్రిక్‌యాప్‌లో పేర్లను నమోదు చేసి వేలు ముద్రలను రికార్డు చేస్తారు. ఈ విధంగా బయోమెట్రిక్ యాప్‌లో నమోదైన పేర్లను హాజరు ద్వార ప్రతిరోజు ఎంత మంది పిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు ఎంత మందికి పథకం అమలవుతుందనేది తేటతెల్లం అవుతుంది. బయోమెట్రిక్ హాజరు వివరాల ప్రకారం ప్రతి నెలా బిల్లులు ఇవ్వనున్నారు.
సూపర్‌వైజర్లకు ట్యాబ్‌లు..
అంగన్‌వాడీ కేంద్రాల్లో జరిగే అక్రమాలకు చెక్ పెట్టేందుకు బయోమెట్రిక్ యాప్ ద్వారా పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.అందులో భాగంగా ప్రభుత్వం సూపర్‌వైజర్లకు ట్యాబులు, టీచర్లకు స్మార్ట్‌ఫోన్లు ఇవ్వనున్నారు. ట్యాబ్స్, స్మార్ట్ ఫోన్లో బయోమెట్రిక్ యాప్ ద్వారా అంగన్‌వాడీ సెంటర్ పూర్తి సమాచారం అందులో నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతి రోజు ఈ యాప్ ద్వార ఏ సెంటర్‌లో ఏం జరుగుతుందో తెలుసుకునే వీలు ఉంటుంది. దీనిద్వారా అక్రమాలు జరిగితే వెంటనే తెలిసిపోతుంది. ఆరోగ్యలక్ష్మి పథకం అమలులో భాగంగా జిల్లాలో మొత్తం 39,981 మంది లబ్ధి పొందుతున్నారు.
ప్రభుత్వం ఇవ్వగానే అమలు చేస్తాం...
అంగన్‌వాడీ కేంద్రాల్లో జరిగే అక్రమాలకు చెక్ పెట్టేందుకు బయోమెట్రిక్ యాప్ ద్వారా పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ముందస్తుగా వరంగల్ అర్బన్ జిల్లాను ఎంపిక చేసి అమలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇవ్వగానే రూరల్ జిల్లాలో కూడ అమలు చేస్తాం. –సబిత, జిల్లా సంక్షేమాధికారిణి
Comments
Please login to add a commentAdd a comment