
సాక్షి, బీబీనగర్: నల్గొండ జిల్లా బీబీనగర్ నిమ్స్ ఆసుపత్రి వద్ద బీజేపీ ఏర్పాటు చేసిన సభా వేదిక అకస్మాత్తుగా కూలింది. మంగళవారం బీజేపీ కార్యకర్తలు, నాయకులు నిమ్స్ పంచాయతీ పేరుతో ఓ నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనికి రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
లక్ష్మణ్ ప్రసంగిస్తుండగా భారీ వర్షంతో పాటు గాలిదుమారం లేచింది. దీంతో ఏర్పాటు చేసిన సభావేదిక, టెంట్లు ఒక్క సారిగా కుప్పకూలాయి. ఏం జరుగుతుందో తెలియక కార్యక్రమానికి వచ్చిన ప్రజలు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఓ మహిళకు గాయాలు కాగా.. మిగతా వారందరూ సురక్షితంగా బయటపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment