చనిపోతూ... జీవం పోస్తూ.. | Breyinded with the occurrence of organ donation | Sakshi
Sakshi News home page

చనిపోతూ... జీవం పోస్తూ..

Published Mon, Apr 6 2015 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 11:54 PM

చనిపోతూ... జీవం పోస్తూ..

చనిపోతూ... జీవం పోస్తూ..

కూతురు పరీక్ష కోసం వచ్చి మృత్యుఒడిలోకి వెళ్లిన బెన్సన్
బ్రెయిన్‌డెడ్ కావడంతో అవయవాల దానం

 
దుండగుల దాడిలో గాయపడి  బ్రెరుున్‌డెడ్ అరుున వరంగల్ కాశిబుగ్గ 22వ డివిజన్ లక్ష్మీపురానికి చెందిన కొమ్ము బెన్సన్ (47) కుటుంబం పుట్టెడు దుఃఖంలోనూ పెద్దమనసుతో ఆలోచించింది. తాను బతికి ఉన్న కాలంలోనూ నలుగురికి ఉపయోగపడిన ఆయనను... మరో ఐదుగురిలో చూసుకునేందుకు ముందుకొచ్చింది. బ్రెరుున్‌డెడ్ అరుు పూర్తి అచేతన స్థితిలోకి వెళ్లిన ఆయన అవయవాలను ఐదుగురికి దానం చేసి దాతృత్వాన్ని చాటుకుంది.
 - కాశిబుగ్గ
 
కాశిబుగ్గ : దుండగుల దాడిలో గాయపడి  బ్రెరుున్ డెడ్ అరుున ఓ వ్యక్తి కుటుంబం పుట్టెడు దుఃఖంలోనూ పెద్దమనసుతో ఆలోచించింది. తాను బతికి ఉన్నకాలంలోనూ నలుగురికి ఉపయోగపడిన ఆయనను మరో ఐదుగురిలో చూసుకునేందుకు ముందుకొచ్చింది. బ్రెరుున్ డెడ్ అరుు పూర్తి అచేతన స్థితిలోకి వెళ్లిన ఆయన అవయవాలను ఐదుగురికి దానం చేసి పుణ్యం కట్టుకున్నారు. వరంగల్ నగరంలోని కాశిబుగ్గ 22వ డివిజన్ లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన కొమ్ము బెన్సన్(47) కర్ణాటక రాష్ట్రానికి ఆరేళ్ల క్రితం తన కుటుంబ సభ్యులతో వెళ్లి కూలీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె ప్రస్తుతం లక్ష్మిపుర ంలో వాళ్ల నాన్నమ్మ వద్ద ఉంటూ పదో తరగతి చదువుకుంటోంది. కూతురికి పరీక్షలు ఉండడంతో మార్చి  27న లక్ష్మిపురంలోని ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అదేరోజు సాయంత్రం రూ.500 చిల్లరకోసమని లక్ష్మిపురం సమీపంలోని ఏఎం వేబ్రిడ్జి కాంటా వద్దకు వెళ్లాడు. అక్కడ పని చేస్తున్న ఇబ్రహీం, అతని స్నేహితుడు శ్రీకాంత్‌తో ఆయనకు మాటమాట పెరిగి గొడవపడ్డాడు. ఈ క్రమంలో వారిద్దరు బెన్సన్‌పై దాడిచేసి ఇనుప రాడ్లతో తీవ్రంగా బాదగా కోమాలోకి వెళ్లాడు.

గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు మృతుడిని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్లు హైదరాబాద్‌కు పంపించారు. ఈ క్రమంలో అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కావడంతో  మృత్యువాత పడ్డాడు. కాగా, మృతుడు బతికున్న సమయంలో వెలిబుచ్చిన కోరిక మేరకు అతని భార్య సరిత, తల్లి మేరమ్మ, కుటుంబ సభ్యులు బెన్సన్ అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చి కాలేయం, కిడ్నీలు, రెండు గుండె కవాటాలను దానం చేసి మరో ఐదుగురికి పునర్జన్మ కల్పించారు. బెన్సన్ కుటుంబం అత్యంత నిరుపేద కుటుంబమైనా గొప్ప మనసుతో శరీర భాగాలను కంటతడి పెడుతూనే ఇతరులకు దానం చేయడాన్ని స్థానికులు, జిల్లా అధికార యంత్రాంగం ఎంతగానో అభినందించింది. స్థానికులు కంటతడి పెడుతూనే దహన సంస్కారాలు నిర్వహించారు. బెన్సన్ లక్ష్మిపురంలోని చర్చి లో చాలా ఏళ్లు సహాయ కార్యదర్శిగా పనిచేస్తూనే పలు స్వచ్చంద కార్యక్రమాల్లో పాల్గొనేవాడని, ఇతరులకు సేవ చేయడం, సహాయ సహకారాలు అం దించడంలో ఎప్పుడు ముందుండేవాడని స్థానికులు చర్చించుకుంటూ కన్నీళ్లపర్యంతమయ్యారు.
 
బతికున్న సమయంలో ఎప్పుడు అనే వాడు..

నా భర్త ఎక్కువ చదువుకోకపోయినా విశాలమైన మనస్థత్వం కలిగినవాడు. అతను బతికున్న సమయంలో ఎప్పుడు కూడా రక్తదానం, నేత్రదానం కన్నా అవయవదానం చేయాలని అంటుండేవాడు. అతని మాటే నిజమైంది.         
 - సరిత, మృతుడి భార్య
 
 
 
 అందరి బాగోగులను ఆకాంక్షించేటోడు..
 తన కుమారుడు దూరప్రాంతంలో బ్రతుకుతూ బిడ్డ పరీక్ష కోసమని నగరానికి వచ్చిండు. ఎప్పుడు ఎవరి జోలికి వెళ్లేవాడు కాదు. అందరి బాగోగులను ఆకాంక్షించే నా కొడుకు మరణించడం చాలా బాధగా ఉంది. అతడి కోరిక మేరకే అవయవదానంతో ఐదుగురికి ప్రాణభిక్ష పెట్టి సంతోషపడ్డాం.                                                              - మేరమ్మ, మృతుడి తల్లి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement