ఎయిర్‌పోర్టులో 32 లైవ్ బుల్లెట్లు స్వాధీనం
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మంగళవారం ఉదయం బుల్లెట్లు కలకలం రేపాయి. ఎయిర్‌పోర్టులో తనిఖీలలో రాజ్‌కుమార్ అనే వ్యక్తి నుంచి 32 లైవ్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ వ్యక్తి వద్ద బుల్లెట్లు ఉండటంతో తోటి ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్తున్నట్లు పోలీసుల విచారణలో ప్రయాణికుడు రాజ్‌కుమార్ తెలిపాడు. రాజ్‌కుమార్ హైదరాబాద్‌కు చెందినవాడని పోలీసులు వివరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.