జిల్లా కేంద్రాల నుంచి రాజధానికి నేరుగా బస్సులు
జిల్లా కేంద్రాల నుంచి రాజధానికి నేరుగా బస్సులు
Published Tue, Aug 1 2017 12:34 PM | Last Updated on Tue, Sep 4 2018 5:29 PM
జనగామ: జిల్లా కేంద్రాల నుంచి రాజధాని హైదరాబాద్‌కు నేరుగా బస్సులు నడుపుతామని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. జనగామలోని రవాణా శాఖ కార్యాలయంలో హరిత హారం కార్యక్రమంలో భాగంగా ఆయన మంగళవారం మొక్కలు నాటారు. జనగామ డిపోకు వజ్ర ఏసీ బస్సులు అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రజా రవాణా లేని 1200 గ్రామాలకు రోడ్లు వేసి బస్సులు నడుపుతామని చెప్పారు.
ప్రజల సహకారంతో హరితహారం కార్యక్రమం సామాజిక ఉద్యమంలా సాగుతోందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలతోపాటు హరితహారం వంటి సీఎం కేసీఆర్ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఏ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, శాసనమండలిలో ప్రభుత్వ విప్ బోడికుంటి వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.
Advertisement