నెలాఖరులో మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ | Cabinet expansion by this month end: KCR | Sakshi
Sakshi News home page

నెలాఖరులో మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్

Published Tue, Jul 8 2014 1:44 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

నెలాఖరులో మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ - Sakshi

నెలాఖరులో మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్

వారం రోజుల్లో రాష్ట్ర సలహా మండలి: సీఎం కేసీఆర్ వెల్లడి
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈ నెలాఖరులో ఉంటుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. అలాగే వివిధ రంగాల మేధావులతో రాష్ట్ర సలహా మండలి(స్టేట్ అడ్వయిజరీ బోర్డు)ని వారం రోజుల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు.
 
సోమవారమిక్కడి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో రాష్ట్ర, జిల్లా అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ విషయాలు వెల్లడించారు. ప్రధాన శాఖతోపాటు దాని అనుబంధ శాఖలన్నీ ఒకే మంత్రి, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి దగ్గరే ఉంటే నిర్ణయాలు వేగంగా తీసుకోవడానికి వీలవుతుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. పలు శాఖలు ఇంకా తన వద్దే ఉన్నాయని పేర్కొంటూ.. ఈనెలాఖరులో మంత్రివర్గ విస్తరణ చేపడతామని వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement