
సాక్షి, హైదరాబాద్: కెనడాలోని ఆల్‌బెర్టా ప్రావిన్సు పారిశ్రామిక వర్గాలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆల్‌బెర్టా ప్రావిన్సు మౌలిక వసతుల శాఖ మంత్రి ప్రసాద్ పండా వెల్లడించారు. మంత్రి కేటీఆర్‌తో జరిగిన భేటీలో ఇరు ప్రాంతాల నడుమ వ్యాపార, వాణిజ్య అవకాశాలపై పండా చర్చించారు. తెలంగాణలో ఐటీ రంగం పురోగమిస్తున్న తీరుపై సానుకూల స్పందన కనిపిస్తోందని, రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక విధానం, ఇతర అనుకూలతలు వివరించేందుకు తమ ప్రావిన్సులో పర్యటించాల్సిందిగా కేటీఆర్‌ను పండా ఆహ్వానించారు. టీఎస్‌ఐపాస్ ద్వారా పేరొందిన కంపెనీలను తెలంగాణకు రప్పించిన తీరుపై పండాకు కేటీఆర్ వివరించారు. ఈ భేటీలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment