
కొత్తగూడెంరూరల్: భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో శుక్రవారం విద్యుత్ షాక్‌తో కెనడా దేశానికి చెందిన ఒక పాస్టర్ మృతిచెందారు. అతడిని కాపాడబోయిన మరో పాస్టర్‌కు గాయాలయ్యాయి. కెనడాకు చెందిన సాల్మన్, నేతన్ పాస్టర్లను కొత్తగూడేనికి చెందిన జాన్ జోసఫ్ విజిటింగ్ వీసా మీద భారతదేశానికి పిలిపించారు. శుక్రవారం గుడ్‌ఫ్రైడే సందర్భంగా సాల్మన్, నేతన్‌లు దేవుని సందేశాలను బోధించారు.
అనంతరం జాన్ జోసఫ్‌కు చెందిన ఒక భవనంలో వీరిద్దరికీ వసతి కల్పించారు. సాల్మన్ ఫస్ట్ ఫ్లోర్‌లో బాల్కనీలో నిల్చుని ఉండగా, పక్కనున్న 11 కేవీ విద్యుత్ వైరుకు ప్రమాదవశాత్తు చేయి తగిలింది. దీంతో ఆయన షాక్‌కు గురయ్యారు. సాల్మన్‌ను కాపాడేందుకు నేతన్ వెళ్లగా, ఆయనకు సైతం విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో సాల్మన్ మృతి చెందగా, నేతన్ కొత్తగూడెంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు