ఉట్నూర్ గ్రామం
ఆదిలాబాద్: ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ గెలుపు కోసం ప్రతి చోటా ప్రచారం జోరు పెంచారు. అదీగాక తమ పార్టీలకు చెందిన రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులను రంగంలోకి దించుతున్నారు. బహిరంగ సభల్లో వారు పాల్గొని క్యాడర్‌లో ఉత్సాహం పెంచుతున్నారు. ఇటు అభ్యర్థుల ముఖ్య అనుచరగణం పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లపై దృష్టి సారిస్తున్నారు. వెయ్యికి పైగా ఓట్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటిని రాబట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వెయ్యికి పైగా ఓట్లు ఉన్న గ్రామాలకు అభ్యర్థులు నేరుగా ఒక్కటికి రెండు సార్లు ప్రచారం కోసం వెళ్తున్నారు.
ఎత్తులకు పై ఎత్తులతో ముందుకు సాగుతున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకుంటూ ప్రచారం మమ్మురం చేస్తున్నారు. నియోజకవర్గంలో 238 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో వెయ్యి ఓట్లకు పైగా ఉన్న కేంద్రాలు 53 ఉన్నాయి. దీంతో అభ్యర్థులు, ముఖ్య నాయకులు వాటిపై ప్రధానంగా దృష్టి సారించారు. తరచూ గ్రామాలకు వెళ్లి తమ అభ్యర్థిని, పార్టీని గెలిపించాలని కోరుతున్నారు. అభ్యర్థులే నేరుగా రంగంలోకి దిగి తమను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు. గ్రామాల్లో ఉండే పెద్ద మనుషులకు తాయిలాలు ఎర వేస్తున్నారు. ఫలితంగా ప్రస్తుత ఎన్నికల్లో వెయ్యి ఓట్లు దాటిన పోలింగ్ కేంద్రాలకు తాకిడి పెరిగింది.
వెయ్యికి పైగా ఓట్లు ఉన్న కేంద్రాలివే..
దేవాపూర్ పోలింగ్ కేంద్రంలో 1,105 ఓట్లు, గౌరపూర్‌లో 1,066, రాంపూర్–బిలో 1,130, గిన్నెరలో 1,086, కేస్లాపూర్‌లో 1,124, దోడందలో 1,068, ఇంద్రవెల్లి–బిలో 1,014, ఇంద్రవెల్లి(17)లో 1,131, ఇంద్రవెల్లి–బి(20)లో 1,061, ఇంద్రవెల్లి–బి(21)లో 1,164, హర్కపూర్‌లో 1,052, వడ్‌గాంలో 1,023, దస్నాపూర్‌లో 1,165, ఉట్నూర్(54)లో 1,079, ఉట్నూర్(58)లో 1,170, లక్కారంలో 1,007, గంగన్నపేట్‌లో 1,145, యోందాలో 1,174, చాందురిలో 1,102, హస్నాపూర్‌లో 1,106, దంతన్‌పల్లిలో 1,102, ఉడుంపూర్‌లో 1,018, దస్తూరాబాద్(103) 1,130, దస్తూరాబాద్(104) 1,186, మున్యాల్‌లో 1,174, రెవోజీపేట్‌లో 1,150, బుట్టాపూర్‌లో 1,055, ధర్మాజీపేట్‌లో 1,105, లింగాపూర్(133)లో 1,080, లింగాపూర్(134)లో 1,028, ఏర్వాచింతల్‌లో 1,155 మంది ఓటర్లు ఉన్నారు. పాత ఏల్లాపూర్(142) పోలింగ్ కేంద్రంలో 1,200, పాత ఏల్లాపూర్(144)లో 1,079, పస్పులలో 1,131, ఇటిక్యాలలో 1,028, సత్తన్‌పల్లిలో 1,075, తిమ్మాపూర్(167)లో 1,060, తిమ్మాపూర్(176)లో 1,026, ఖానాపూర్(180)లో 1,017, ఖానాపూర్(182)లో 1,152, బాదన్‌కుర్తిలో 1,005, మురిమడుగులో 1,045, మొర్రిగూడలో 1,030, రెండ్లగూడలో 1,119, జన్నారంలో 1,068, పోన్కల్(212)లో 1,133, పోన్కల్(213)లో 1,014, పోన్కల్(216)లో 1,070, కిష్టాపూర్‌లో 1,169, చింతగూడ(231)లో 1,036, చింతగూడ(233)లో 1,152, తపాలపూర్‌లో 1,024, తిమ్మాపూర్‌లో 1,046 మంది ఓటర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment