అభ్యర్థుల ఆస్తులివే..! | Candidates Property Records Of Nalgonda Constituency | Sakshi
Sakshi News home page

అభ్యర్థుల ఆస్తులివే..!

Published Tue, Nov 20 2018 9:48 AM | Last Updated on Tue, Nov 20 2018 9:50 AM

Candidates Property Records Of Nalgonda Constituency - Sakshi

శాసన సభ ఎన్నికల నామినేషన్ల పర్వం సోమవారంతో ముగిసింది. అభ్యర్థులంతా తమ నామినేషన్ల పత్రంతో పాటు ఆస్తులు, అప్పుల వివరాలు అధికారులకు అందజేశారు. అభ్యర్థితోపాటు కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలనూ వాటిలో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రధాన పార్టీల అభ్యర్థుల ఆస్తులు, అప్పుల వివరాలు ఇలా ఉన్నాయి.  

నాగార్జున సాగర్‌ :
జానారెడ్డి : కుందూరు జానారెడ్డి తన వద్ద రూ.4.25 లక్షలు, ఆయన సతీమణి సుమతి చేతిలో నగదు రూ.3.50లక్షలు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. స్థిరాస్తులు రూ.2,73,80,000 విలువైనవి ఉండగా, చరాస్తులు రూ.58,29,361 విలువైని ఉన్నట్లు చూపించారు. అయన సతీమణి సుమతి పేరుతో ప్రస్తుత రూ.9,61,24,333 విలువైన స్థిరాస్తులు, చరాస్తులు రూ.4,05,80,592 విలువైన ఉన్నట్లు పేర్కొన్నారు. ఇద్దరి పేరుతో అప్పులు ఏమీ లేనట్లు పేర్కొన్నారు.

నర్సింహయ్య : టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల నర్సింహయ్య పేరుతో రూ.43లక్షలు విలువైన స్థిరాస్తి, ఆయన సతీమణి నోముల లక్ష్మి పేరుతో కోటీ నాలుగు లక్షల 90వేల విలువైన స్థిరాస్తి ఉన్నది. చరాస్తులు నోముల నర్సింహ్మయ్య పేరుతో రూ.23,47,000 ఉండగా, ఆయన భార్య పేరుమీద రూ.17,63,000 విలువైనవి ఉన్నవి. నర్సింహయ్య చేతిలో 15వేలు, లక్ష్మి చేతిలో రూ.3వేలు ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపించారు.    

నివేదిత: కంకణాల నివేదిత పేరుతో 29ఎకరాల వ్యవసాయ పొలం (విలువ చూపలేదు), రూ.3,28,50,843విలువై చరాస్తి, చేతిలో నగదు రూ.30 వేలు ఉండగా.. 30లక్షల అప్పు ఉన్నట్లు తెలిపారు. ఆమె భర్త కంకణాల శ్రీధర్‌రెడ్డి పేరుమీద రూ.6,08,34,090 విలువైన చరాస్థి, చేతిలో రూ.25వేలు ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపించారు. వారి కూతురు కంకణాల కావ్యకు కోటీ 20వేల రూపాయల విలువైన చరాస్థి, 2.06 ఎకరాల స్తిరాస్థి ఉండగా.. చేతిలో నగదు ఏమీ లేకపోగా రూ.4కోట్ల50లక్షల అప్పు ఉన్నట్లు చూపించారు.

హుజూర్‌ నగర్‌..
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి: టీపీసీసీ అధ్యక్షుడు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆస్తులు గత ఎన్నికల కంటే ప్రస్తుతం తగ్గాయి. 2014 ఎన్నికల సమయంలో అఫిడవిట్‌లో తన వద్ద రూ. 34,04,152 డిపాజిట్లు ఉన్నట్లుగా చూపించారు. ప్రస్తుతం తనకు సొంత కారు కూడా లేదని, తన చేతిలో కేవలం రూ.18 వేలు, తన సతీమణి పద్మావతిరెడ్డి వద్ద రూ.5 వేలు ఉన్నాయని ప్రకటించారు. ఉత్తమ్‌ ఆస్తి విలువ రూ.2 కోట్లు కాగా, ఆయన భార్య పేరు మీద కారు, వ్యవసాయ భూమితో సహా రూ.28.29 లక్షల స్థిర, చరాస్థులు ఉన్నట్లు చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఉత్తమ్‌ వార్షికాదాయం రూ.30లక్షల మేర పడిపోయిందని ఎన్నికల అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 2014లో తన పేరు మీద రూ.34.04,152 డిపాజిట్లు ఉన్నట్లుగా చూపించగా.. ప్రస్తుతం అవి రూ.8.94 లక్షలకు పడిపోయాయి.    2017–18 ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయం రూ. 2.04లక్షలుగా చూపించారు.   

ఎస్‌.సైదిరెడ్డి: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన శానంపూడి సైదిరెడ్డి తన చేతిలో రూ.15 వేలు. తన భార్య రజితారెడ్డి చేతిలో రూ.10 వేల ఉన్నట్లుగా చూపించారు. తన పేరు మీద రూ.12,50,000 విలువ చేసే కారు, రూ.9 లక్షల విలువైన బంగారం, తన సతీమణి పేరు మీద రూ.50 లక్షల విలువైన బంగారం ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. సూర్యాపేట మండలం దురాజ్‌పల్లి వద్ద, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో రూ.5,25,83,600 విలువైన భూములు, స్థలాలు, తన సతీమణి రజితారెడ్డి పేరు మీద అనంతగిరి మండలం మొగలాయికోట, కోదాడ తదితర ప్రాంతాల్లో రూ.1,83,81,000 విలువైన వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు ఉన్నట్లు చూపించారు.   

సూర్యాపేట :
గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి : టీఆర్‌ఎస్‌ సూర్యాపేట అభ్యర్థి మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మొత్తం చరాస్తుల విలువ రూ.58,77,625, స్థిరాస్తుల విలువ రూ.66,95,320 ఉన్నట్లుగా అఫిడవిటిలో చూపారు. చేతిలోనగదు రూ.1,39,873, బ్యాంకు ఖాతాలో రూ.25,47,564, బాండ్స్‌ రూపంలో పెట్టుబడి రూ.95,948, పోస్టల్‌ సేవింగ్‌ రూ.11,37,131 ఉన్నట్లుగా పేర్కొన్నారు. రూ.15,52,960 విలువైన ఇన్నోవా, రూ.66,000 విలువ చేసే 20 గ్రాముల బంగారం ఇలా మొత్తం చరాస్తులు రూ.58,77,615 ఉన్నట్లు చూపించారు. రూ.9,50,000 అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. భార్య సునీత చేతిలో నగదు రూ.4,68,787, బ్యాంకు ఖాతాలో రూ.8,22,208, బాండ్స్‌ రూపంలో పెట్టుబడి రూ.31,67,911, పోస్టల్‌ సెవింగ్‌ అండ్‌ ఎల్‌ఐసీ పాలసీల్లో రూ.8,85,527, అడ్వాన్ల రూపంలో రూ.58,94,400, రూ.1,40,786 విలువ చేసే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వాహనం, రూ.17,31,250 విలువ చేసే 500 గ్రాముల బంగారం, మొత్తం చరాస్తి విలువ రూ.1,31,06,871 ఉన్నట్లుగా పేర్కొన్నారు. అదే విధంగా రూ.96,79,523 విలువ చేసే స్థిరాస్తులు అయితే ఇందులో రూ.87,00,000ల అప్పులు ఉన్నట్లు చూపారు. 

రాంరెడ్డి దామోదర్‌రెడ్డి : కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి రూ.48,03,228 విలువ గల చరాస్థులు, కోటి విలువగల స్థిరాస్థులు, రూ.34,86,157 అప్పులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. హ్యాండ్‌ క్యాష్‌ రూ.25,000, బ్యాంకు ఖాతాలో రూ.20,81,228,  రూ.16 లక్షల విలువ చేసే సఫారి వాహనం, రూ.3లక్షల విలువ చేసే జీప్, రూ.7,65,000 విలువ చేసే 250 గ్రాముల బ్రాస్‌లెట్, రూ.32వేల విలువ గల 10 గ్రాముల ఉంగరం ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తం చరాస్తి విలువ రూ.48,03,228 కాగా రూ.కోటి విలువ చేసే స్థిరాస్తులు ఉండగా ఇందులో రూ.34,86,157ల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు.  

సంకినేని వెంకటేశ్వర్‌రావు : బీజేపి అభ్యర్థిగా పోటీలో ఉన్న సంకినేని వెంకటేశ్వర్‌రావు రూ.39,35,382 విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన భార్య పేరుమీద రూ.13,64,018 విలువగల చరాస్థులు ఉన్నట్లు చూపారు.  హ్యాండ్‌ క్యాష్‌ రూపంలో రూ.3,25,856 బ్యాంకు ఖాతాలో రూ.36,09,526 ఉండగా రూ.20,53,100 అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇతర వాహనాలు, ఆస్తులు లేనట్లు పేర్కొన్నారు. తన భార్య వద్ద హ్యాండ్‌ క్యాష్‌ రూపంలో రూ.11,50,640, బ్యాంక్‌ ఖాతాలో రూ.9,378, రూ.2,04,000 విలువ గల 512 గ్రాముల బంగారం ఉన్నట్లు చూపారు. రూ.9,95,056 అప్పు ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా ఇతర కుటుంబ సభ్యుల వద్ద హ్యాండ్‌క్యాష్‌ రూపంలో రూ.1,26,085, బ్యాంక్‌ ఖాతాల్లో రూ.40,14,367 ఉన్నట్లు పేర్కొన్నారు. రూ.3,16,46,000 విలువగల స్థిరాస్తులు ఉన్నట్లు లెక్క చూపారు.

  భువనగిరి :  
పైళ్ల శేఖర్‌రెడ్డి : భువనగిరి నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసిన పైళ్ల శేఖర్‌రెడ్డి చరాస్తులు  2014తో పోలిస్తే పెరిగాయి. స్థిరాస్తులు తగ్గాయి. 2014లో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఉన్న చరాస్తులతో పోలిస్తే ప్రస్తుతం రూ.38,09,32,639 పెరిగాయి. అలాగే చరాస్తులు రూ.25,96,08,677కు తగ్గాయి. ప్రస్తుతం ఆయన పేరున చరాస్తులు రూ. 69,00,80,939, స్థిరాస్తులు రూ.1,59,25,323 ఉన్నట్లు పేర్కొన్నారు. భార్య పేరున చరాస్తులు రూ.5,39,68,923, స్థిరాస్తులు రూ.15,03,18,620 ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
 
కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి : కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి చరాస్తులు రూ. 45,23,75,582, స్థిరాస్తులు రూ. 65,09,03,000, ఆయన భార్య పేరున చరాస్తులు రూ.9,72,15,813, స్థిరాస్తులు రూ.13,17,43,750 ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.  

మునుగోడు :
కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి : టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు తనకు రూ.9.36 కోట్లు ఉన్నట్టుగా చూపించారు. ప్రస్తుత అఫిడవిట్‌లో సుమారు రూ.12.40 కోట్లుగా చూపించారు. తన భార్య అరుణరెడ్డి పేరు మీద సుమారు రూ.1.92 కోట్లు ఆస్తులు ఉన్నట్టుగా చూపించారు. ప్రభాకర్‌రెడ్డి మీద అప్పులు రూ.74,98,000 చూపించారు. 

గంగడి మనోహర్‌రెడ్డి : బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ గంగడి మనోహర్‌రెడ్డి 2014 ఎన్నికల్లో రూ.2.40కోట్లు ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత అఫిడవిట్‌లో సుమారు రూ.2.97 కోట్లుగా చూపించారు. రూ.90లక్షలు అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. తన పేరున భార్య రూ.24లక్షలు ఆస్తులు ఉండగా, ఎటువంటి అప్పులు లేవు.

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి : కాంగ్రెస్‌ ఆభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి అఫిడవిట్‌లో సుమారు ఆస్తులు రూ.7.00 కోట్లుగా చూపించారు. తన భార్య లక్ష్మి పేరు మీద సుమారు రూ.288 కోట్లు ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. రాజగోపాల్‌రెడ్డి మీద అప్పులు రూ.18 లక్షల చూపించారు. లక్ష్మి మీద రూ.6.50లక్షలు చూపించారు. సొంత ఇల్లు కూడా లేదని, కుటుంబ సభ్యులు పేరుమీద ఎటువంటి వాహనం లేదని చూపించారు.  

నకిరేకల్‌ :
వేముల వీరేశం : వీరేశం పేరు మీద చర ఆస్తులు రూ.30లక్షలు ఉండగా ఆయన సతీమణి పుష్పలత పేరు మీద రూ.20లక్షలు చూపారు. స్థిరాస్తులు ఆయన పేరు మీద రూ.36లక్షలు, భార్య పేరు మీద రూ.90 లక్షలు చూపారు. నకిరేకల్‌ మండలం కడపర్తి శివారులో రూ.35లక్షల విలువ చేసే 10.26 ఎకరాల భూమి వీరేశం పేరుమీద ఉండగా శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామంలో 4.18 ఎకరాల భూమి ఉంది. బ్యాంక్‌ డిపాజిట్‌లో వీరేశం పేరుమీద రూ.లక్ష, భార్య పుష్పలత పేరుమీద రూ.లక్ష ఉన్నాయి. అప్పుల విషయానికి వస్తే వీరేషం పేరు మీద రూ.3.20లక్షలు, భార్య పుష్పలత పేరు మీద రూ.6.12లక్షలు అప్పులు ఉన్నట్లు వారి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.  

చిరుమర్తి లింగయ్య : కాంగ్రెస్‌ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యకు నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులో 11 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దీని విలువ రూ.44లక్షలు, ఇదే గ్రామంలో అతని భార్య పార్వతమ్మ పేరు మీద 3.33 ఎకరాల భూమి దీని విలువ రూ.13లక్షలు ఉన్నట్లు చూపారు. చిరుమర్తి చేతిలో రూ.30వేలు, ఆయన భార్య చేతిలో రూ.15వేలు చూపారు. బ్యాంక్‌ డిపాజిట్‌లో అతని పేరు మీద రూ.1.50లక్షలు, భార్య పేరు మీద రూ.15వేలు ఉన్నట్లు చూపించారు. చిరుమర్తి వద్ద రూ.75వేల విలువైన బంగారం, ఆయన భార్య వద్ద రూ.5లక్షలు విలువ చేసే 200 గ్రాముల బంగారం, కుమారుడి వద్ద రూ.25వేల విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నట్లు చూపారు. చరాస్థులు రూ.3లక్షలు లింగయ్య పేరు మీద, రూ.5లక్షలు పార్వతమ్మ పేరు మీద చూపారు. లింగయ్య పేరు మీద రూ.8లక్షలు, పార్వతమ్మ పేరు మీద రూ.5లక్షల అప్పులు చూపారు.  

తుంగతుర్తి : 
గాదరి కిశోర్‌కుమార్‌ : టీఆర్‌ఎస్‌ తుంగతుర్తి అభ్యర్థి గాదరి కిశోర్‌కుమార్‌ తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు వెల్లడించారు. నగదు రూ.25వేలు, భార్య వద్ద రూ.5వేలు, వివిధ బ్యాంకుల్లో సేవింగ్స్‌ రూ.7,45,251 బీమా, జాతీయ పొదుపు పత్రాలు రూ.7,30,325, భార్య పేరున రూ.33,601 బీమా, జాతీయ పొదుపు పత్రాలు రూ.5లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు. రూ.22వేల విలువ గల ద్విచక్ర వాహనం, రూ.9లక్షల విలువగల ఇన్నోవా ఉన్నట్లు తెలిపారు.  తన వద్ద రూ.3లక్షల విలువైన 100 గ్రాముల బంగారం, భార్య వద్ద రూ.9లక్షల విలువగల 300 గ్రాముల బంగారం,  నల్లగొండ సమీపంలోని బుద్దారంలో రూ.13.80లక్షల విలువ గల 13.32 ఎకరాల భూమి, వేములవాడలో భూమి, రాయగిరి, మాలిపురం, సమతాపురి కాలనీ, శాంతినగర్, నల్లగొండలో తన పేరుపై రూ.26లక్షలు, భార్య పేరున రూ.1,18,013 విలువ గల స్థలాలు ఉన్నట్లు పేర్కొన్నారు. మార్కెట్‌ విలువ ప్రకారం. తన పేరున రూ.53,01,250, భార్య కమల పేరున రూ.15,31,946 లక్షల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు.  

కోదాడ :
నలమాద పద్మావతి :
కాంగ్రెస్‌ కోదాడ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన ఎన్‌.పద్మావతిరెడ్డి ఆస్తులు 2014 కన్నా స్పల్పంగా పెరిగాయి. చరాస్తుల విషయంలో ఆమె చేతిలో రూ.15 వేల, భర్త ఉత్తమ్‌ వద్ద రూ.18 వేలు నగదు మాత్రమే ఉన్నాయి. బ్యాంకులలో డిపాజిట్‌లు, బంగారు ఆభరణాలు, కారు విలువ కలిపి రూ.70,01,146 పేర్కొన్నారు. తన భర్త ఉత్తమ్‌ పేరు మీద మొత్తం చరాస్తులు రూ.8,94,164 ఉన్నట్లు తెలిపారు. స్థిరాస్తులు మహబూబ్‌నగర్‌ జిల్లా కొడంగల్‌లో 14 ఎకరాల 47 సెంట్ల వ్యవసాయభూమి, హూజూర్‌నగర్‌లో రెండు ప్లాట్లు, కోదాడలో 28 లక్షల 29 వేల విలువైన ఒక ఇల్లు ఉన్నట్లు పేర్కొన్నారు. తన భర్త పేరుతో స్థిరాస్తులు జూబ్లిహిల్స్‌లో ఇల్లు, బొగ్గులకుంటలో అపార్టుమెంట్‌ ప్లాట్, 2025 గజాల స్థలం, మరో రెండు ప్లాట్లు కలిపి 2 కోట్ల 646 రూపాయల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. తన ఆస్తులు గతంలో కన్నా రూ.20 లక్షలు పెరిగినట్లు ఆమె అఫిడవిట్‌లో చూపారు.  

ఆలేరు :
గొంగిడి సునీత : ఆలేరు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గొంగిడి సునీత తన పేరుమీద రూ.40 వేలు, పార్చూన్‌ కారు విలువ రూ.38 లక్షలు, రూ.6.76లక్షల విలువైన బంగారం, రాజపేట మండలం రఘునాథపురంలో 15.07 ఎకరాల భూమి, ఘట్కేసర్‌ మండలం కొర్రెంలలో 200 చదరపు గజాత స్థలం, వంగపల్లిలో భనవం, మొత్తం దీని విలువ రూ.1,15,05,000. అప్పులు రూ.80వేలు. (పంట రుణం) ఉంది. ఆమె భర్త మహేందర్‌రెడ్డి పేరు మీద నగదు రూ.49 వేలు, ఇన్నోవా కారు విలువ రూ.16 లక్షలు. రూ.2.64లక్షల విలువైన బంగారం, రూ. 3,02,70000 విలవైన ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. అప్పులు, బ్యాంక్‌ రుణాలు రూ.62,85,00,000 ఉన్నాయి. కూతురు హర్షిత పేరిట రూ.10వేలు. రూ.2.64లక్షల విలువైన బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు. అప్పులు ఎడ్యుకేషన్‌ కోసం బ్యాంకులో తీసుకున్న రుణం రూ.25లక్షలు ఉన్నట్లు తెలిపారు. 

భిక్షమయ్యగౌడ్‌ : కాంగ్రెస్‌ ఆలేరు అభ్యర్తి బూడిద భిక్షమయ్యగౌడ్‌ తన పేరుమీద ఉన్న ఆస్తులు వెల్లడించారు. రూ. 2,00,000, బ్యాంకు డిపాజిట్లు రూ.1.7లక్షలు, రూ.60,000 విలువైన బంగారం, 3 వాహనాలు వాటి విలువ రూ.44 లక్షలు. గుండాల మండలం పారుపల్లి, బుజిలాపూర్‌లో 55.39 ఎకరాల భూమి ఉందని.. రూ.52 లక్షల అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. భార్య సువర్ణ పేరిట.. రూ.79,000, రూ.6లక్షల వివువైన బంగారం, రూ.6,47,847 విలువైన వాహనం. గుండాల మండలం పారుపల్లి, ధర్మాపురంలలో 33.36 ఎకరాల భూమి, ఉప్పల్‌లో 211 చదరపు గజాల ఇల్లు, రూ.16లక్షల విలువైన ఇన్నోవా, రూ.48,13,850 లప్పులు ఉన్నట్లు తెలిపారు. కుమారుడు ప్రవీన్‌కుమార్‌ పేరిట రూ.15000, రూ. 27,500 డిపాజిట్లు,  షేర్లు రూ.70,95,000, రూ.60వేల విలువైన బంగారం, రూ.43లక్షల విలువైన రెండు వాహనాలు, రాంపల్లి, నాగిరెడ్డిగూడ, దర్మాపురంలో 24.30 ఎకరాల భూమి, ఉప్పల్‌లో 266 చదరపు గజాల ఇల్లు ఉంది. అప్పులు రూ.1.97కోట్లు ఉన్నట్లు తెలిపారు. కూతురు ప్రసన్నవాణి పేరిట నగదు రూ.15,000, డిపాజిట్లు రూ.2వేలు, రూ.3లక్షల విలువైన బంగారం, కొరటికల్‌లో 5 ఎకరాల భూమి ఉంది.  

  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement